ఢిల్లీలో తిరగడానికి అనుమతులు ఉన్న డీజల్ కార్లు
ప్రపంచ వ్యాప్తంగా వాహన కాలుష్యం పెచ్చులు మీరుతున్న నేపథ్యంలో దీనిని కొంతమేరకు అయినా తగ్గించాలని సుప్రీం కోర్టు గత ఏడాదిలో ఒక నిర్ణయం తీసుకుంది. 2000సీసీ కెపాసిటి కన్నా ఎక్కువ కెపాసిటి గల డీజల్ కార్ల రిజిస్ట్రేషన్లను ఢిల్లీ పరిధిలో రద్దు చేసింది.
తద్వారా చాలా వరకు 2000సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం గల వాహనాల అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇదేమిటి అంటే ఇలా చేస్తే వాహన కాలుష్యం కొంత మేరకు తగ్గించవచ్చని సుప్రీం కోర్టు అంటోంది. అయితే మరి ఏ కార్లను ఢిల్లీ బ్యాన్ చేయలేదు అని ఇప్పటికే చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించడం మానండి ఎందుకంటే క్రింది కథనం ద్వారా ఢిల్లీలో ఎంచక్కా తిరగడానికి అనుమతులు గల కార్ల లిస్ట్ ఇవ్వడం జరిగింది.

మారుతి సుజుకి
దేశీయంగా కార్ల తయారీలో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి చిన్న, కాంపాక్ట్ సెడాన్, ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్. కాంపాక్ట్ ఎస్‌యువి, ఎమ్‌పివి మరియు సెడాన్ సెగ్మెంట్లలో కార్లను అందిస్తోంది. తరువాత స్లైడర్ల ద్వారా సెగ్మెంట్ల వారిగా బ్యాన్ చేయని కార్ల గురించి తెలుసుకుందాం.

చిన్న కార్లు
మారుతి సుజుకి దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉంచిన చిన్న కార్లలో సెలెరియో, రిట్జ్ మరియు స్విఫ్ట్ కార్లతో ఢిల్లీ రహదారుల మీద ఎంచక్కా తిరగవచ్చు.

కాంపాక్ట్ సెడాన్ మరియు ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్
మారుతి ఈ సెగ్మెంట్లో కూడా కార్లను అందుబాటులో ఉంచింది. ఇందులో మారుతి బాలెనొ, మారుతి ఎస్-క్రాస్ మరియు స్విఫ్ట్ డిజైర్ కార్లు కలవు, వీటి మీద ఢిల్లీలో ఎటువంటి ఆక్షేపణలు లేవు.

కాంపాక్ట్ ఎస్‌యువి, ఎమ్‌పివి మరియు సెడాన్
మారుతి సుజుకికు చెందిన వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువి, ఎర్టిగా ఎమ్‌పివి మరియు మారుతి సియాజ్ సెడాన్ కార్లకు కూడా ఎటువంటి అడ్డంకులు లేవు.

హ్యుందాయ్
అమ్మకాల పరంగా రెండవ స్థానంలో ఉన్న హ్యుందాయ్ మోటార్స్ వారి కార్లలో కొన్నింటిని నిషేధించానా మరికొన్నింటి మీద ఎటువంటి నిషేధం లేదు. అలా నిషేదం లేని కార్ల గురించి తరువాత స్లైడర్ల ద్వారా తెలుకుందాం రండి.

చిన్న మరియు నాలుగు మీటర్లు లోపు ఉన్న డీజల్ కార్లు
ఈ సెగ్మెంట్లో హ్యుందాయ్ నుండి కొనుగోలు చేయడానికి నిషేధం విధించని వాటిలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మరియు హ్యుందాయ్ జెంట్ కాంపాక్ట్ సెడాన్ కార్లు కలవు.

ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ మరియు సెడాన్
ఈ వేరియంట్లో హ్యుందాయ్ వారి బెస్ట్ సెల్లింగ్ కారు ఐ20 మరియు ఐ20 ఆక్టివాలు ఉన్నాయి. అలాగే సెడాన్ సెగ్మెంట్లో వెర్నా మరియు ఎలంట్రా కార్లు ఉన్నాయి.

ఎస్‌యువిల పరంగా
హ్యుందాయ్ వారి ఎస్‌యువిలలో దేశవ్యాప్తంగా ఉన్న బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యువి క్రెటా. ఎందుకంటే ఇది 2000 సీసీ కన్నా తక్కువ కెపాసిటి ఉండటం వలన. కాబట్టి వీటిని ఢిల్లీలో చక్కగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

టాటా మోటార్స్
ప్రస్తుతం టాటా మోటార్స్ వారు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉంచిన టాటా ఇండికా, ఇండిగో, బోల్ట్, మరియు జెస్ట్ కార్లను ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఎటువంటి నిభందనలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంతే కాకుండా టాటా మోటార్స్ వారి లేటెస్ట్ హ్యాచ్‌బ్యాక్ టియాగో మీద కూడా ఎటువంటి ఆక్షేపణలు లేవు.

మహీంద్రా అండ్ మహీంద్రా
దేశంలో అతి పెద్ద మూడవ వాహన తయారీ సంస్థ మహీంద్రా మరియు సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయానికి వెంటనే స్పందించి అతి తక్కువ కాలంలోనే ఢిల్లీ తమ వాహనాలు తిరిగే విధంగా ఇంజన్‌లను రీడిజైన్ చేసి మార్కెట్లోకి అందించింది.

చిన్న కార్లు, హ్యాచ్‌బ్యాక్ మరియు సెడాన్ కార్లు
ఈ సెగ్మెంట్లలో ఢిల్లీలో నిషేదించని కార్లు మహీంద్రా వారి కెయువి100, మహీంద్రా వెరిటో వైబ్, మహీంద్రా వెరిటో మరియు అతి త్వరలో విడుదల కానున్న నువోస్పోర్ట్ వంటి వాహనాలు ఉన్నాయి.

ఎస్‌యువిలు
మహీంద్రా వారి అమ్మకాలలో ఎక్కువ శాతం ఎస్‌యువిలే. మహీంద్రా వారి ఎక్స్‌యూవీ500. టియువీ300 మరియు స్కార్పియో వంటి వాహనాల నిషేందం నుండి విముక్తి పొందాయి. ఎందుకంటే నిషేధం విదించిన వెంటనే మహీంద్రా తమ ఎక్స్‌యూవీ500 మరియు స్కార్పియోలలో 2000సీసీ కన్నా తక్కువ కెపాసిటి గల ఇంజన్‌ల ద్వారా అందుబాటులోకి తీసుకు వచ్చింది.

హోండా మోటార్స్
జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ హోండా ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉంచిన సిటి, అమేజ్, జాజ్ మరియు ఎమ్‌పివిల సెగ్మెంట్లో ఉన్న మొబిలియో కార్లకు ఢిల్లీ నిషేధం నుండి మినహాయింపు లభించింది.

ఫోర్డ్
ఫోర్డ్ వారి ఫిగో హ్యా్చ్‌బ్యాక్, ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్, మరియు ఎకో స్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యువి మీద ఎటువంటి నిభందనలు లేవు.

నిస్సాన్ మరియు రెనో
నిస్సాన్ వారి మైక్రా, సన్నీ, ఎవాలియా మరియు టెర్రానో ఉత్పత్తులు అధేవిదంగా రెనోకు చెందిన పల్స్, లాజి, స్కాలా, ఫ్లూయెన్స్ మరియు డస్టర్, కొలియోస్ ఉత్పత్తుల ఢిల్లీ నిషేదానికి దూరంగా ఉన్నాయి.

స్కోడా
ఇండియన్ మార్కెట్లో అతి తక్కువ స్థాయిలో కార్లను ప్రవేశపెట్టిన స్కోడాకు చెందిన ర్యాపిడ్, ఆక్టావియా యెటి మరియు సూపర్బ్ వాటి మీద ఎటువంటి నిషేధం లేదు.

ఫియట్
ఫియట్ వారి పుంటో ప్యూర్, పుంటో ఎవో, అవెంచురా, లీనియా క్లాసిక్, ఫియస్టా మరియు లీనియా వంటి కార్ల మీద ఎటువంటి నిషేదం లేదు.

టయోటా మోటార్స్
టాయోటా వారి ఎటియోస్ లివా, ఎటియోస్, ఎటియోస్ క్రాస్ మరియు కర్రోలా ఆల్టిస్ వంటి కార్ల మీద ఢిల్లీలో ఎటువంటి నిషేదం లేదు.

వోక్స్‌వ్యాగన్
వోక్స్‌వ్యాగన్ వారి కార్లలో పోలో, పోలో క్రాస్, వెంటో మరియు జెట్టా కార్లు నిషేదానికి దూరంగా ఉన్నాయి.

నిషేధానికి దూరంగా ఉన్న లగ్జరీ కార్లు
బిఎమ్‌డబ్ల్యూ:
బిఎమ్‌డబ్ల్యూకి చెందిన ఎక్స్1, ఎక్స్ 3, 1 సిరీస్ మరియు 5 సిరీస్ కార్లు నిషేధానికి దూరంగా ఉన్నాయి. కారణం ఇందులోని ఇంజన్‌లు 2000సీసీ కెపాసిటి కన్నా తక్కువ స్థాయిలో ఉండటం.

ఆడి
ఆడి వారి ఏ3, ఏ4, ఏ6, క్యూ3 మరియు క్యూ5 వంటి లగ్జరీ కార్ల మీద ఎటువంటి నిషేదం లేదు

వోల్వో
వోల్వో వారి వి40, వి40 క్రాస్, ఎస్60, ఎస్80, ఎక్స్‌సి60, మరియు ఎక్స్‌సి90 వంటి కార్లు ఢిల్లీ నిషేధం నుండి మినహాయింపును పొందాయి.

నిషేదాన్ని అధిగమించే ఆలోచనలో కొన్ని సంస్థలు
2000సీసీ కన్నా ఎక్కువ కెపాసిటి ఉండి మంచి అమ్మకాలు సాధిస్తున్న వాహనాలలో కొన్ని తయారీ సంస్థలు ప్రత్యేకంగా ఇంజన్‌ను అభివృద్ది చేయాలని చూస్తున్నాయి. అయితే మహీంద్రా ఒకడుగు ముందుకు వేసి తమ ఎక్స్‌యూవీ500 మరియు స్కార్పియోలలో 2000సీసీ కన్నా తక్కువ ఇంజన్ సామర్థ్యం ఉండేట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. సుప్రీం కోర్టు నిషేధపు చెర నుండి తప్పించుకునే అన్వేషణలో కొన్ని సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

- విరాట్ కోహ్లి కార్ కలెక్షన్
- యాంకర్ అనసూయ అకౌంట్లో ఖరీదైన ఆడి కారు
- టైర్ల వలన జరిగే ప్రమాదాలను ఇలా నివారించండి.
- ఇలలో స్వర్గానికి ఇరవై ఐదు అనువైన ఇండియన్ రోడ్లు
- ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమమైన పది అంతర్జాతీయ విమానాశ్రయాలు
- ఊహలకందని అమీర్ ఖాన్ వ్యక్తిత్వం మరియు కార్ల ప్రపంచం



Click it and Unblock the Notifications








