ట్రాఫిక్ జామ్ కాదు, గిన్నిస్ ప్రపంచ రికార్డ్ కోసం...!!
ప్రపంచ వ్యాప్తంగా ఫోర్డ్ సంస్థకు డెట్రాయిట్ నుండి అభిమానుల సంఖ్య ఎక్కువే ఉంటుంది. కాని ఇక్కడ ఉన్న బల్గేరియన్ల గుంపు కన్నా అమితంగా ఫోర్డ్‌ను ఎవరూ ఇష్టపడరు అని మేమంటాం. ఎందుకంటే వారు ఏం చేసారో మీరే చూడండి....

బ్లూ ఓవెల్ బ్యాడ్జి (అడ్డంగా ఉన్న కోడి గుడ్డు ఆకారంలో ఉన్న నీలం రంగు వస్తువు అంటే ఫోర్డ్ లోగో) గుంపును ఫోర్డ్ అభిమానులు అని సాధారణంగా అంటాం.

బల్గేరియాలోని ఫోర్డ్ ప్రేమికులు అందరూ సుమారుగా 20 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిని ట్రాఫిక్ చేశారు.

వారు ఇలా చేయడం వెనకున్న కారణాన్ని పరిశీలిస్తే, "ఫోర్డ్ కార్లతో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన క్యూ" గా గిన్నిస్ ప్రపంచ రికార్డులో స్థానం కోసం చేసినట్లు తెలిసింది.

మొదట్లో ఫోర్డ్ కార్ల క్యూ గిన్నిస్ రికార్డ్ ఏంటి అని సందేహం వచ్చి ఉంటుంది. కాని గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డుల్లో ఫోర్డ్ కార్లను అత్యంత పొడవు మేర క్యూలో ఉంచినట్లు రికార్డయ్యింది. దానిని బద్దలుకొట్టడానికి ఇలా చేశారు.

సుమారుగా 1527 ఫోర్డ్ కార్లతో ఈ రికార్డ్‌ను నెలకొల్పారు. ఈ రికార్డు కోసం 2,300 కార్లు ఆ స్థలికి చేరుకున్నప్పటికీ అన్ని కార్లు కూడా ఈ క్యూలో ప్రవేశించలేకపోయాయి. అయినప్పటికీ ఈ కార్యక్రమం విజయవంతమయ్యి గిన్నిస్ రికార్డులకెక్కింది.

దీనికి ముందు రికార్డు, ఫోర్డ్ వాహనాల పొడవైన క్యూ గా 829 వాహనాలతో అమెరికాలో నెలకొల్పారు.

2016 జూన్‌లో కొత్త కార్ల మీద ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్లు
ప్రపంచపు అతి పెద్ద క్రూయిజ్ నౌక: ఇందులో ప్రయాణం స్వర్గమే...!!


Click it and Unblock the Notifications