చాటుగా తిరుగుతున్న మహీంద్రా క్యాంటో ఫేస్ట్ లిఫ్ట్: రహస్య ఫోటోలు
మహీంద్రా అండ్ మహీంద్రా వారు తమ క్వాంటో ఫేస్ లిఫ్ట్ కారుకు రహస్యంగా పరీక్షలు నిర్వహిస్తుండగా ఇలా కెమెరాలకు పట్టు పడింది. దీనిని క్యాంటో లేదా క్రెస్టో అనే వాటిలో ఏదో ఒక పేరుతో అతి త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.
Also Read: మహీంద్రా కెయువి కంప్లీట్ రివ్యూ: ఇంజన్, మైలేజ్, ధర మరిన్ని వివరాలకు
మహీంద్రా వారి అప్ కమింగ్ ఫేస్ లిఫ్ట్ క్వాంటో గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో తెలుసుకుందాం రండి.

ఇంజన్
ఇందులో శక్తివంతమైన ఎమ్-హాక్80 అనే మూడు సిలిండర్ల డీజల్ ఇంజన్ తో వస్తున్నట్లు తెలిసింది.

పవర్
ఈ క్వాంటో ఫేస్ లిఫ్ట్ కారులో గల అత్యంత శక్తివంతమైన ఇంజన్ దాదాపుగా 83 బిహెచ్‌పి పవర్ మరియు 230 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను విడుదల చేయును.

ట్రాన్స్‌మిషన్
ఇందులో గల ఇంజన్‌కు మహీంద్రా అండ్ మహీంద్రా వారు 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గల గేరు బాక్స్‌ను అందిస్తున్నారు. ఇది ఆటోమేటిక్ వెర్షన్‌లో రానుంది.

ఫోర్ వీల్ డ్రైవ్
ఇంతకు ముందు గల క్వాంటో కార్లలో మహీంద్రా అండ్ మహీంద్రా 2.2-లీటర్ ఇంజన్ గల ఫోర్ వీల్ డ్రైవ్‌ను అందిస్తోంది. అయితే వీటిని అలాగే కొనసాగించనున్నారు.

ఫీచర్లు
- ఇందులో క్రొత్త ఫ్రంట్ గ్రిల్
- పగటి పూట వెలిగే లైట్లు
- క్రొత్త బంపర్
- గాలిని లోపలికి గ్రహించే విధంగా డిజైన్ చేయబడిన బ్యానెట్
- మొత్తం మీద ఇది చూడటానికి అన్ని వైపులా అందంగా ఉంది.
- మహీంద్రా కెయువి100 ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ ఫోటోలు
- 2016లో విడుదలకు సిద్దమైన కొత్త కార్లు, వాటి వివరాలు

పోటి
ఎప్పటిలాగే ఈ క్వాంటో ఫేస్ లిఫ్ట్ ఎస్‌యువి మార్కెట్లో ఉన్న డస్టర్ మరియు ఎకో స్పోర్ట్ వంటి వాటితో పోటికి సిద్దం కానుంది.

మొదటి ఓటమి
మహీంద్రా అండ్ మహీంద్రా వారు దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన మొదటి కాంపాక్ట్ ఎస్‌యువి క్వాంటో, రెనో వారి డస్టర్ మరియు ఫోర్డ్ వారి ఎకో స్పోర్ట్ లా మంచి అమ్మకాలను సాధించలేక పోయింది.

అయితే మహీంద్రా వారి క్వాంటో ఫేస్ లిఫ్ట్ కారులో ఎమ్-హాక్ ఇంజన్ ను అందిస్తున్నారు. ఇది కూడా కెయువి మరియు స్కార్పియో కార్లలాగే మంచి ఫలితాలను ఇస్తుందని తెలిపారు

మూలం: ఆటోకాలమన్ మరియు ఇండియన్ ఆటోబ్లాగ్


Click it and Unblock the Notifications








