నోట్ బ్యాన్ ఎఫెక్ట్: మహీంద్రా ఉత్పత్తులపై 2.71 లక్షల వరకు ఆఫర్లు

మహీంద్రా అండ్ మహీంద్రా తమ లైనప్‌లో ఉన్ని దాదాపు అన్ని ఉత్పత్తుల మీద భారీ ఆఫర్లను ప్రకటించింది. ఇంత వరకు మహీంద్రా భారీ మొత్తంలో ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించడం ఇదే మొదటి సారి.

By Anil

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లయిన రూ. 500 మరియు రూ. 1000 ల చెలామణి రద్దు భారతీయ ఆటోమొబైల పరిశ్రమలో సునామీ సృష్టించింది. ఈ నిర్ణయం కార్ల అమ్మకాల్లో భారీ పతనానికి కారణమయ్యింది. అయితే ఎలాగైనా కస్టమర్ల దృష్టిని ఆకర్షించాలని వాహన తయారీ సంస్థలు భారీ ఆఫర్లు మరియు డిస్కౌంట్లతో వివియోగదారులకు వల వేస్తున్నాయి. అందులో ఒకటి మహీంద్రా అండ్ మహీంద్రా.

మహీంద్రా వాహనాలపై ఆఫర్లు

మహీంద్రా చరిత్రలో గరిష్టంగా రూ. 2.71 లక్షల వరకు ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించడం ఇదే ప్రప్రథమం అని చెప్పాలి. మహీంద్రా లైనప్‌లోని వాహనాల పై ఆఫర్ల వివరాలు ఈ కథనంలో తెలుసుకోగలరు.

మహీంద్రా వాహనాలపై ఆఫర్లు

గత గురువారం (01/12/2016) రోజున మహీంద్రా అండ్ మహీంద్రా అధికారులు తమ డీలర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం.

మహీంద్రా వాహనాలపై ఆఫర్లు

దేశ వ్యాప్తంగా తమ ప్యాసింజర్ మరియు కమర్షియల్ వాహనాల అమ్మకాలు భారీగా పడిపోయాయి. మరీ ముఖ్యంగా ప్రాంతీయ మరియు చిన్న చిన్న నగరాలలో మహీంద్రా వారి ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉండేది. అయితే నోట్ల రద్దు కారణంగా కోల్పోతున్న అమ్మకాలను పెంచుకునేందుకు ఈ ఆఫర్లను 40 రోజుల వరకు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

మహీంద్రా వాహనాలపై ఆఫర్లు

మహీంద్రా అత్యధిక విక్రయాలు జరుపుతున్న ఎస్‌యువి స్కార్పియో మీద గరిష్టంగా రూ. 50,000 ల వరకు ఆఫర్లు మరియు డిస్కౌంట్లు ఉన్నాయి. ప్రదేశం మరియు వేరియంట్‌ని బట్టి ప్రకటించిన ఆఫర్ మొత్తంలో వ్యత్యాసం ఉండే అవకాశం కలదు. స్కార్పియో ప్రారంభ వేరియంట్ ధర రూ. 10,38,472 లు ఎక్స్ షోరూమ్ హైదరాబాద్‌గా ఉంది.

మహీంద్రా వాహనాలపై ఆఫర్లు

గ్రామీణ ప్రాంతాల్లో మంచి డిమాండ్ గల బొలెరో ఎస్‌యువి మీద మహీంద్రా రూ. 67,000 ల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. మహీంద్రా బొలెరో ప్రారంభ వేరియంట్ ధర రూ. 6,83,196 లు ఎక్స్ షోరూమ్ హైదరాబాద్‌గా ఉంది.

మహీంద్రా వాహనాలపై ఆఫర్లు

మహీంద్రా ఎస్‌యువి లైనప్‌లో ఉన్న అత్యుత్తమ అమ్మకాలు సాగించే ప్రీమియమ్ ఎస్‌యువి ఎక్స్‌యూవీ500 మీద గరిష్టంగా 89,000 ల రుపాయల వరకు డిస్కౌంట్లను ప్రకటించింది. మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ. 12,52,742 లు ఎక్స్ షోరూమ్ హైదరాబాద్‌గా ఉంది.

మహీంద్రా వాహనాలపై ఆఫర్లు

మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన కెయువి100 యంగ్ ఎస్‌యువి గత నాలుగైదు మాసాలుగా విక్రయాల్లో వెనకడుగేస్తోంది. అందుకో దీని మీద భారీగా రూ. 73,000 వరకు డిస్కౌంట్లను ప్రకటించింది. మహీంద్రా కెయువి100 ప్రారంభ వేరియంట్ ధర రూ. 4,66,735 లు ఎక్స్‌ షోరూమ్ హైదరాబాద్‌గా ఉంది.

మహీంద్రా వాహనాలపై ఆఫర్లు

మహీంద్రా నుండి అత్యంత ఖరీదైన ఎస్‌యువి శాంగ్‌యాంగ్ రెక్ట్సాన్ మీద గరిష్టంగా రూ. 2.71 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఎంచుకునే వేరియంట్, ప్రదేశం మరియు ఇతర అంశాల పరంగా ఈ ఆఫర్ వర్తిస్తుంది. శాంగ్‌యాంగ్ రెక్ట్సాన్ ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ. 21,21,494 లు ఎక్స్ షోరూమ్ హైదరాబాద్‌గా ఉంది.

మహీంద్రా వాహనాలపై ఆఫర్లు

మహీంద్రాతో పాటు దేశీయంగా ఉన్న మరిన్ని కార్ల తయారీ సంస్థలు కూడా నోట్ల రద్దు ప్రభావానికి తీవ్రంగా గురవుతున్నాయి. అందులో మారుతి సుజుకి, హ్యుందాయ్ మరియు రెనో తో పాటు మరిన్ని సంస్థలు తమ ఉత్పత్తుల మీద డిస్కౌంట్లు మరియు ఆఫర్లు ప్రకటించాయి.

మహీంద్రా వాహనాలపై ఆఫర్లు
  • రూ. 2,50,000 ల వరకు డిస్కౌంట్లు ప్రకటించిన హ్యుందాయ్
  • రెనో ఇండియా డిసెంబర్ ఆఫర్లు: లక్ష రుపాయల వరకు ప్రయోజనాలు
  • ఎంట్రీ లెవల్ కార్ల మీద ఆఫర్లు మరియు డిస్కౌంట్లతో హ్యుందాయ్ ని చితక్కొడుతున్న మారుతి

More from DriveSpark

Article Published On: Monday, December 5, 2016, 16:47 [IST]
English summary
Demonetisation Affect: Mahindra & Mahindra Offering Heavy Discount To Boost Sales
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+