మహీంద్రా ఇంపీరియో పికప్ ట్రక్ 6.25 లక్షలు మాత్రమే
దేశీయ వాణిజ్య వాహనాల విభాగంలో మహీంద్రా అండ్ మహీంద్రా మరొక కొత్త వాహనాన్ని ప్రవేశ పెట్టింది. ఇంపీరియా పికప్ అనే ఈ వాహనాన్ని మార్కెట్లోకి 6.25 లక్షల రుపాయలతో విడుదల చేసింది. ఇది డబుల్ మరియు సింగల్ క్యాబిన్ ఆప్షన్‍లలో అందుబాటులో ఉండనుంది.
మహీంద్రా వారి వ్యాపార వాణిజ్యం వాహనం ఇంపీరియో గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

భారతీయ మార్కెట్లో ఇంపీరియో ధరలు
సింగల్ క్యాబిన్
- ఎస్‌సి (బిఎస్ III) ధర రూ. 6.25 లక్షలు
- ఎస్‌సి (బిఎస్ IV) ధర రూ. 6.40 లక్షలు
- ఎస్‌సి విఎక్స్ (బిఎస్ III) ధర రూ. 6.60 లక్షలు
- ఎస్‌సి విఎక్స్ (బిఎస్ IV) ధర రూ. 6.75 లక్షలు
- మహీంద్రా నుండి మిని ట్రక్కు మరియు 8-సీట్ల మిని వ్యాను
- 10 లక్షలలోపు బడ్జెట్‌తో ఉత్తమ భద్రత ఫీచర్లు కలిగిన టాప్-10 కార్లు!
- మారుతి సుజుకి నుండి 7-సీటర్ వ్యాగన్‌ఆర్ కారు: మరిన్ని వివరాలకు

పీరియో ధరలు
డబుల్ క్యాబిన్
డిసి (బిఎస్ III) ధర రూ. 6.60 లక్షలు
డిసి (బిఎస్ IV) ధర రూ. 6.75 లక్షలు
డిసి విఎక్స్ (బిఎస్ III) ధర రూ. 7.12 లక్షలు
డిసి విఎక్స్ (బిఎస్ IV) ధర రూ. 7.27 లక్షలు
అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ముంబాయ్ గా ఉన్నాయి.

ఇంపీరియో
మహీంద్రా వారు ఇంపీరియో వాహనాన్ని మహీంద్రా ముందు వాహనం జినియో స్థానంలో విడుదల చేసినట్లు తెలిపారు. దీని మీద పరిశోధన మరియు అభివృద్దిని చెన్నైలో గల మహీంద్రా వ్యాలీలో చేశారు. అయితే దీనిని సంస్థ యొక్క చకన్ ప్లాంటులో ఉత్పత్తిని ప్రారంభిస్తున్నారు.

ఇంపీరియో ఇంజన్
మహీంద్రా వారి సరికొత్త ఇంపీరియోలో 2.5-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 75 బిహెచ్‌పి పవర్ మరియు 220 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మైలేజ్
మహీంద్రా వారి ఇంపీరియో లో గల ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంది. ఇది వాహనం యొక్క మైలేజ్ లీటర్‌కు 13.55 కిలోమీటర్లు ఇవ్వడంలో సహాయపడుతుంది.

టన్నేజ్ కెపాసిటి
మహీంద్రా విడుదల చేసిన ఇంపీరియో సింగల్ క్యాబిన్ 2,930 కేజిలు మరియు ఇంపీరియో డబుల్ క్యాబిన్ 1,240 కిలో వరకు బరువును మోయగలవు.

ఫీచర్లు
సరికొత్త ఇంపీరియో పికప్ ట్రక్కులో సరికొత్త హెడ్‌లైట్లు, కొత్త బంపర్, 16-అంగుళాల టైర్లు, ఎయిర్ కండీషనింగ్, కొత్త పవర్ స్టీరింగ్ మరియు ఇంజన్ యొక్క ఇమ్మొబిలైజర్ వంటి నూతన సదుపాయాలు ఇందులో కలవు.



Click it and Unblock the Notifications








