మహీంద్రా వారి 27 వాహనాలతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సాహస యాత్ర
ఇండియన్ మార్కెట్లో ఎస్‌యువి వాహనాలకు పేరుగాంచిన మహీంద్రా అండ్ మహీంద్రా మొదటి సారిగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సాహస యాత్రను ప్రారంభించింది. మహీంద్రా వారు తమ ఎస్‌యువి వాహనాలతో ఈ మధ్యనే మంగళూరు నుండి గోవా వరకు మాన్‌సూన్ అడ్వెంచర్ యాత్రను నిర్వహించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో సుమారుగా 4,500 కిలోమీటర్లు సాగే ఈ సాహస యాత్రను మహీంద్రా అండ్ మహీంద్రా ప్రారంభించింది. దీని గురించి పూర్తి వివరాలు...

మహీంద్రా వారు సాహస యాత్రలకు ఉత్సుకతను చూపే వారితో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ వివిధ రకాల సాహస యాత్రలను నిర్వహిస్తోంది. అందులో భాగంగానే మహీంద్రా జూలై 09, 2016 న కాశ్మీర్2కన్యాకుమారి యాత్రను ప్రారంభించింది. ఇది జూలై 24, 2016 న ముగియనుంది.

అడ్వెంచర్ ప్రియులకు కలగా ఉన్నఈ కె2కె యాత్రలో సుమారుగా 27 వాహనాలను వినియోగించారు.

ఈ సుదీర్ఘ కె2కె అడ్వెంచర్ యాత్రలో పాల్గొన్నవారు వివిధ రకాల భూభాగాలను సవాళ్లుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సాగుతున్న ఈ యాత్రలో మహీంద్రా వారి ఎస్‌యువి వాహనాలైన టియువి300, నువోస్పోర్ట్, థార్, స్కార్పియో మరియు ఎక్స్‌యూవీ500 వంటి వాహనాలు ఉన్నాయి.

అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో సాగే ఈ యాత్రలో ఔత్సాహికులు ఉత్తమ అనుభవాన్ని పొదుతూ, రోడ్డు భద్రత మీద పూర్తి స్థాయి అవగాహన కల్పించనున్నారు.

మహీంద్రా వారి కాశ్మీర్ నుండి కన్యాకుమారి యాత్రలో దారి పొడవునా వైద్య సదుపాయాలు మరియు వాహన సంబంధం సమస్యలను నివారించడానికి సంభందిత మహీంద్రా డీలర్‌ను అందుబాటులో ఉంచనున్నారు.

అడ్వెంచర్ ఔత్సాహికులు కన్యాకుమారి చేరుకున్న తరువాత విజేతలను ప్రకటించే కార్యక్రమం జరుగుతుంది. ఈ మొత్తం యాత్ర సుమారుగా 16 రోజుల పాటు సాగనుంది.

- నడి సంద్రంలో తేలియాడే విమానాశ్రయం....


Click it and Unblock the Notifications








