వరుణ్ థావన్‌కు మహీంద్రా కెయువి100 బహుమానం
ఇండియన్ మార్కెట్లోకి మొదటి సారిగా యువ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్‌ను పరిచయం చేసిన సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా. మహీంద్రా వారి కెయువి100 కారును ముద్రణ మరియు ప్రదర్శణ విభాగాల ద్వారా ప్రముఖ బాలీవుడ్ నటుడు వరుణ్ థావన్ ప్రచారం నిర్వహిస్తున్నాడు.

యంగ్ ఎస్‌యువి కెయువి100 కు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న వరణ్ థావన్‌కు మహీంద్రా ఒక కెయువి100 ను ప్రధానం చేయడానికి నిర్ణయించుకుంది.

ప్రకాశవంతమైన నారింజ రంగులో ఉన్న కెయువి100 మిని ఎస్‌యువిని వరుణ్ థావన్‌కు మహీంద్రా బహుకరించింది.

కాంపాక్ట్ సెడాన్ మరియు హ్యాచ్‌బ్యాక్ మద్య ఉన్న ఎంచుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ మిని ఎస్‌యువి.

సాంకేతికంగా ఇందులో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లు కలవు.

కెయువి100లోని పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్‌లకు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేసారు.

మహీంద్రా కెయువి100 ప్రారంభ వేరియంట్ ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 5,46,878 లు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 8,46,896 లుగా ఉంది.

దేశీయ మార్కెట్లోకి త్వరలో రానున్న డాట్సన్ గో క్రాస్ మరియు షెవర్లే బీట్ ఆక్టివ్ వంటి వాటికి పోటీగా నిలవనుంది. ప్రస్తుతం ఏ విధమైన పోటీని ఎదుర్కోలేదు.

- పాక్ ఉగ్ర మూకల అంతం కోసమేనా...?
- హీరో ప్యాసన్ ప్రొ ఐ3ఎస్ విడుదల: ప్రారంభ ధర రూ. 51,653 లు
- అవెంచురా అర్బన్ క్రాస్ విడుదల, ప్రారంభ ధర రూ. 6.85 లక్షలు


Click it and Unblock the Notifications








