విడుదలైనప్పటి నుండి 37,000 ల బుకింగ్స్ నమోదు చేసుకున్న మహీంద్రా కెయువి100
మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాది ప్రారంభంలో కెయువి100 అనే వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. స్వదేశీ ఆధారిత సంస్థ తయారు చేసిన కెయువి 100 ఎస్‌యువి ఇప్పటి వరకు 37,000 ల బుకింగ్స్‌ను నమోదు చేసుకుంది. ఈ కెయువి 100 వాహనం మహీంద్రా వారి మొదటి మిని ఎస్‌యువి.

ప్రస్తుతం మహీంద్రా అండ్ మహీంద్రా వారి కెయువి100 ఎస్‌యువి పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. 1.2-లీటర్ సామర్థ్యంతో రెండు వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Also Read: మహీంద్రా కెవియు1OO విమర్శ (కంప్లీట్ రివ్యూ): ఇంజన్, మైలేజ్, ఫీచర్ల కోసం...
సరికొత్త కెయువి 100 మిని ఎస్‌యివి ఆరు విభిన్న రంగుల్లో లభించును దీనికి అద్దిన రంగుల రకాలు ఫిర్రీ ఆరేంజ్, డాజ్లింగ్ సిల్వర్, డిజైనర్ గ్రే, మిడ్‌నైట్ బ్లాక్, పియర్ల్ వైట్ మరియు అక్వా మెరైన్. 3+3 ఆప్షన్‌లో సీటింగ్ సౌలభ్యతను కల్పించిన భారతదేశపు మొదటి ఏకైక మిని ఎస్‌యువి ఇది.
ప్రస్తుతం మహీంద్రా వారి కెయువి100 మిని ఎస్‌యువికి ఇండియన్ మార్కెట్లో ఏవిధమైన ప్రత్యక్ష మరియు పరోక్ష పోటి లేదు. అయితే మారుతి సుజుకి త్వరలో విడుదల చేయనున్న ఇగ్విస్ మిని ఎస్‌యువి మోడల్ దీనికి పోటిగా నిలవనుంది. కెయువి100 యొక్క ప్రారంభ ధర రూ. 4.57 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.


Click it and Unblock the Notifications





























































































