భారీ ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించిన మహీంద్రా
భారతదేశపు వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా వారు ఇండియన్ మార్కెట్లోకి 2016 మైటీ మాన్‌సూన్ ఆఫర్ల పేరుతో తమ ఎస్‌యువి శ్రేణిలో ఉన్న ఎంచుకోదగ్గ ఉత్పత్తుల మీద భారీ ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించింది. జూలై 31, 2016 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు మహీంద్రా తెలిపింది. ఆఫర్లు మరియు డిస్కౌంట్ల వివరాల కోసం క్రింది స్లైడర్ల మీద ఓ లుక్కేసుకోండి.

నూతన ఎక్స్‌యూవీ500
మహీంద్రా వారి నూతన ఎస్‌యువీ ఎక్స్‌యూవీ500 మీద గరిష్టంగా 22,000 రుపాయల వరకు లాభాలను ప్రకటించారు. ఎక్స్‌యూవీ500 అత్యంత ఆకర్షణీయమైన ప్రారంభం ధర రూ. 11.29 లక్షలు ఎక్స్ షోరూమ్‌గా అందుబాటులో ఉంది.

ఎక్స్‌యూవీ500 గురించి
ఇందులో లీటర్‌కు 16 కిమీలు మైలేజ్ ఇవ్వగలిగే మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల 2.0 లీటర్ ఇంజన్ మరియు 13.85 కిమీలు మైలేజ్ ఇవ్వగలిగే ఆటేమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల 2.2 లీటర్ సామర్థ్యం ఉన్న రెండు డీజల్ ఇంజన్ ఆప్షన్లు కలవు.

కెయువి100
మహీంద్రా వారు తాజాగా విడుదల చేసిన కెయువి100 మీద గరిష్టంగా 32,000 వరకు లాభాలను ప్రకటించారు. మహీంద్రా వారి కెయువిలోని ప్రారంభ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 4.42 లక్షలుగా ఉంది.

కెయువి100 గురించి
ఇందులో 18.15 కిమీలు మైలేజ్ ఇవ్వగల 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 25.32 కిమీలు మైలేజ్ ఇవ్వగల 2.0 లీటర్ ఇంజన్ కలదు. రెండు ఇంజన్‌లు కూడా మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉన్నాయి.

స్కార్పియో
మహీంద్రా వారు మొదటి సారిగా అందుబాటులోకి తెచ్చిన స్కార్పియో ఎస్‌యువి మీద సుమారుగా 35,000 రుపాయల వరకు లాభాలను ప్రకటించారు. ప్రారంభ వేరియంట్ స్కార్పియో ఎక్స్ షోరూమ్ ధర రూ. 8.82 లక్షలతో అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు SCORPIO అని టైప్ చేసి 5757577 నెంబర్‌క్ ఎస్‌ఎమ్ఎస్ పంపండి.

స్కార్పియో గురించి
స్కార్పియోలో 15.4 కిమీలు మైలేజ్ ఇవ్వగలిగే 2.5 లీటర్, 15.4 కిమీల మైలేజ్ ఇవ్వగలిగే 2.2 లీటర్ మరియు 2.0 లీటర్ సామర్థ్యం ఉన్న మూడు డీజల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. మూడు ఇంజన్‌లు కూడా మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉన్నాయి.

టియువి300
టియువి300 ఎస్‌యువి మీద మహీంద్రా మాన్‌సూన్ ఆఫర్స్ సందర్భంగా సుమారుగా 57,000 రుపాయల వరకు డిస్కౌంట్లను ప్రకటించారు.

టియువి300 గురించి
టియువి300 వాహనంలో 18.49 కిమీల మైలేజ్ ఇవ్వగల 1.5 లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌ను అందించారు. దీనికి మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

నువోస్పోర్ట్
మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాదిలో రెండవ ఎస్‌యువిగా అందించిన వాహనం నువోస్పోర్ట్. దీని మీద కూడా మాన్‌సూన్ ఆఫర్లుగా 57,000 రుపాయల వరకు లాభాలను ప్రకటించింది. దీని ప్రారంభ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.44 లక్షలుగా ఉంది.

నువోస్పోర్ట్ గురించి
టియువి300 లో అందించిన అదే 1.5 లీటర్ డీజల్ ఇంజన్‌ను ఇందులో అందించారు. మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది లీటర్‌కు 17.4 కిమీల మైలేజ్ ఇవ్వగలదు. దీని ప్రారంభ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.59 లక్షలుగా ఉంది.

- పుతిన్ ఆవిష్కరించిన ఈ విమానం 2 గడియల్లో భూమ్మీద ఏ మూలకైనా చేరుకోగలదు


Click it and Unblock the Notifications








