2016 మహీంద్రా మాన్‌సూన్ ఛాలెంజ్- విశిష్టతలు మరియు విజయాలు
ఆధునిక ప్రపంచంలో వాహనాలను అమ్మడం అనే విషయం కేవలం అతి చిన్న భాగం మాత్రమే. వినియోగదారులను నిరతరం కలుపుకొని ఉండటం అనేది చాలా పెద్ద అంశం. ఎప్పటికప్పుడు వినియోగదారులకు చేరువలో ఉంటూ, అన్ని కార్యకలాపాలలోనూ వారితో మమేకమై ఉండటం అనేది పెద్ద విషయం, అచ్చం మహీంద్రా అండ్ మహీంద్రాలా....
మహీంద్రా సంస్థ మహీద్రా అడ్వెంచర్స్ క్రింద వివిధ రకాల ప్రదేశాలలో వివిధ రకాల డ్రైవింగ్ పోటీలను నిర్వహిస్తోంది. అందులో తాజాగా మహీంద్రా మాన్‌సూన్ ఛాలెంజ్‌ను తమ మహీంద్రా వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. కాలం, వేగం మరియు దూరం అనే రూపంలో ఈ ఈవెంట్ జరిగింది. ఈ మాన్‌సూన్ అడ్వెంచర్‌లో భాగంగా సుమారుగా 600 కిలోమీటర్లు పాటు మంగళూరు నుండి గోవా వరకు జరిగింది.

మహీంద్రా నిర్వహించిన ఈ పోటీలను డ్రైవింగ్‌లో అత్యంత అనుభవజ్ఞులైన మరియు అడ్వెంచర్ డ్రైవింగ్ ఔత్సాహికుల స్వాగతం పలికింది. ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారు జోడిగా డ్రైవర్ మరియు న్యావిగేటర్‌లు ఉంటారు. మహీంద్రా వారి అందించే వాహనాలను వినియోహించుకుని ఈ పోటీలలో పాల్గొన్నారు.
2016 మహీంద్రా మాన్‌సూన్ అడ్వెంచర్‌లో నిభందనల ప్రకారం జట్టుకు కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉండాలి. అందులో డ్రైవర్ మరియు న్యావిగేటర్.
మహీంద్రా ముందస్తుగా ఇందులో పాల్గొనేవారికి చిన్న పరీక్ష నిర్వహించింది. ఇందులో పాల్గొన్న జట్లు వసతి తీసుకున్నహోటల్ మోతీ మహల్ నుండి మంగళూరులోని పోరమ్ మాల్ వరకు చిన్న పరీక్ష నిర్వహించారు. ఆ తరువాత ఫోరమ్ మాల్ నుండి కొన్ని కార్యక్రమాల అనంతరం జండా ఊపి 2016 మహీంద్రా మాన్‌సూన్ అడ్వెంచర్‌ను ప్రారంభించారు.

ఈ అడ్వెంచర్‌ను పూర్తి చేయడానికి మహీంద్రా వారు రూట్ బూక్‌ను అందజేశారు, ఇందులో దిశలు, నిర్దేశాలు, సమయం వంటి అనేక వివరాలను పొందుపరిచారు. వాటికి అనుగుణందా అడ్వెంచర్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే మొదటి రోజు ఉదయం వీరి అడ్వెంచర్ ప్రయాణం మంగళూరు నుండి కర్ణాటకలోని షిమోగ వరకు సాగింది.
షిమోగ వరకు సాగిన ప్రయాణంలో హై వే రహదారులు చాలా తక్కువ మరియు ప్రయాణానికి అత్యంత ఇబ్బందికంగా ఉండే రోడ్డు ఎక్కువగా ఉంది. వీరి మొదటి రోజు ప్రయాణంలో మహీంద్రా వారి రూట్ మ్యాప్ ఆధారంగా సిగంధూరు అనే ప్రాతం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. సింగంధూరులో రోడ్డు ఒక వైపు నుండి మరో వైపు బోటులో వెళ్లారు, ఇది వారికి ఎంతో గొప్ప అనుభవాన్న మిగిల్చింది.

2016 మహీంద్రా మాన్‌సూన్ అడ్వెంచర్‌లో రెండవ రోజు ఎంతో కీలకమైనది. విజేతలను నిర్ణయించే రోజు కూడా ఇదే. రెండవ రోజు ఉదయం రూటు మ్యాపులను అందుకుని బయలుదేరే సమయాన్ని నమోదు చేయించుకున్న తరువాత ఒకరి వెంట ఒకరు పాల్గొన్నవారందరూ గోవా వైపుగా 340 కిలోమీటర్ల లక్ష్య ఛేదనలోకి దిగారు.
సూర్యాస్తమయం అయ్యేలోపు ఇందులో పాల్గొన్న వారందరూ తమ మాన్‌సూన్ అడ్వెంచర్‌ను ఎటువంటి అటంకాలు లేకుండా కొనసాగించారు. రూటు మ్యాపులో ఇచ్చిన వివరాల ప్రకారం వీరి ప్రయాణం దేశంలో ఏడు న్యూక్లియర్ పవర్ స్టేషన్లు ఉన్న ప్రదేశం కియాగి మీదుగా సాగింది.

సుధీర్ఘ ప్రయాణం అనంతరం పోటీదారులు కార్వార్ ప్రదేశం చేరుకుని అటు నుండి గోవా ముఖ్య రహదారికి దిశను మార్చుకుని రాత్రి ప్రయాణం కొనసాగించారు. ప్రయాణ మార్గంలో మహీంద్రా అందించిన రూట్ మ్యాపు ఆదారంగా కొన్ని ప్రదేశాలలో పోటీదారులు అక్కడకు చేరుకున్న సమయం వంటి వివరాలు టైమ్ కార్డులో నమోదు చేసుకుంటూ వెళ్లడం జరిగింది.

ఇందులో పాల్గొన్న పోటీదారులతో కొన్ని మీడియా సంస్థలు కూడా వెంట వెళ్లాయి. అందులో ఆరు జాతీయ భాషల్లో ఆటోమొబైల్స్ గురించి సమాచారం మరియు వార్తలను అందిస్తున్న డ్రైవ్‌స్పార్క్ కూడా వీరి వెంట ఉంది. మహీంద్రా నిర్వహించే అడ్వెంచర్ డ్రైవింగ్ పోటీలలో ఈ 2016 మహీంద్రా మాన్‌సూన్ అడ్వెంచర్ ఎన్నో అనుభవాలను మిగిల్చింది. ఇందులో డ్రైవ్‌స్పార్క్ బృందంలోని సభ్యులు కూడా పాల్గొన్నారు.

2016 మహీంద్రా మాన్‌సూన్ అడ్వెంచర్‌లో మా బృందం మహీంద్రా వారి నువోస్పోర్ట్ ఎస్‌యువిని వినియోగించడం జరిగింది. పనితీరు పరంగా ఇందులోని మూడు సిలిండర్ల డీజల్ ఇంజన్ అద్భుతం అని చెప్పాలి. అంతేకాకుండా రెండవ వరుసలోని స్పేస్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.
సాంకేతిక ఫీచర్ల పరంగా నువోస్పోర్ట్‌లో ఎయిర్‌బ్యాగులు, స్టీరింగ్ ఆధారిత కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్ మరియు ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్ దీనికి అనుసంధానంగా ఏయుఎక్స్, యుఎస్‍బి మరియు బ్లూటూత్ కనెక్టివిటి కలవు. మలుపుల వద్ద ఇందులో ప్రయాణం ఎంతో క్రేజీగా ఉంటుంది. ఇది మలుపులు తీసుకునే సమయంలో గాలిలో తేలిన అనుభూతికి కూడా లోనవుతారు. సుమారుగా 600 కిలోమీటర్ల మేర సాగిన ప్రయాణంలో ఇది ఎంతగానో ఆకట్టుకుంది కాని ఇందులో వినియోగించిన ప్లాస్టిక్ పరకరాలు మినహా అంతా బాగానే ఉంటుంది.

టిఎస్‌డి ర్యాలీ అంటే ఏమిటి ?
టిఎస్‌డి ర్యాలీని టైమ్ స్పీడ్ డిస్టెన్స్ లేదా రెగ్యులారిటీ ర్యాలీ అని కూడా అంటారు. ఇటువంటి ర్యాలీలను సాధారణ రోడ్లు లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ర్యాలీన రోడ్ల మీద నిర్వహిస్తారు. ఈ టిఎస్‌డి ర్యాలీ ప్రకారం, పాల్గొనే జట్టు ప్రత్యేక సమయం మరియు సగటు వేగం వంటి వివరాలను నమోదు చేస్తూ ఉండాలి.
ఇలాంటి ర్యాలీలలో పాల్గొనే ప్రతి జట్టుకు రూటు బుక్‌ను అందజేస్తారు. అందులో ప్రతి జట్టు సమయం మరియు ప్రదేశం నమోదు చేస్తూ ఉండాలి. ర్యాలీ నిర్వహించే వారు పాల్గొనేదారుల వెంట పోటీలు నిర్వహించే వారు వెంట వస్తారు.

మొత్తం ర్యాలీలో అక్కడక్క కొన్ని చెక్ అవుట్ పాయింట్లు ఉంటాయి. అక్కడ చేరుకోవాల్సిన సమయం ఉంటుంది. అందులో చేరుకున్న సమయాన్ని నమోదు చేయాలి.తద్వారా ప్రతి చెక్ అవుట్ పాయింట్ల మధ్య సరైన సమయం పాటించాల్సి ఉంటుంది. ఇలా పాటించడం వలన నిర్ణీత వేగంతోనే డ్రైవింగ్ చేస్తార. వారు నమోదు చేసిన వివరాలు ప్రకారం చివరగా విన్నర్లను ప్రకటిస్తారు.

2016 మహీంద్రా మాన్‌సూన్ ఛాలెంజ్ గురించి:
మహీంద్రా మాన్‌సూన్ ఛాలెంజ్ భారత దేశం యొక్క అతి పెద్ద టిఎస్‌డి ర్యాలీ మరియు మోటార్ స్పోర్ట్ ఔత్సాహికులను ప్రోత్సహించే వేదిక కూడా. అయితే ఈ ఏడాది ఈవెంట్ టైటిల్ అధికారిక భాగస్వామి టైర్ల పార్ట్నర్ సియట్ వ్యవహరించింది.


Click it and Unblock the Notifications
































