ఇన్నోవాకు పోటీగా వస్తోన్న మహీంద్రా ఎమ్‌పివి: టెస్టింగ్ ఫోటోలు మరియు వివరాలు
దేశీయంగా మంచి విజయాన్ని సాధించిన టయోటా వారి ఇన్నోవా క్రిస్టాకు పోటీగా మహీంద్రా సరికొత్త ఎమ్‌పివి ని తీసుకురానుంది. ప్రస్తుతం ఎస్‌యువిలకు పెట్టింది పేరుగా వెలుగొందుతున్న మహీంద్రా వారు ఎమ్‌పివి రూపొందిస్తున్నారు. దీనిని చెన్నై పరిసర ప్రాంతాల్లో పరీక్షించారు.

పేరు ఇంకా ఖరారు చేయని ఈ మహీంద్రా వారి ఎమ్‌పివి ని 2017 లో ఇండియన్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే టయోటా ఇన్నోవా క్రిస్టాను దెబ్బ తీసేందుకు సరైన ధరకు దీనిని అందివ్వనున్నారు.

డిజైన్ పరంగా ఈ ఎమ్‌పివి ముందు వైపును చాలా యాంగులర్‌గా మలిచారు. రెండు భాగాలుగా ఉన్న ఫ్రంట్ గ్రిల్‌కు ఇరువైపులా యాంగులర్ హెడ్ ల్యాంప్స్‌ను అందించారు. మరియు ముందు వైపున ఉన్న బ్యానెట్ కొద్దిగా వాలుగా ముందు వరకు పొడవుగా ఉంది.

మహీంద్రా ఎమ్‌పివిలో వెనుక వైపున గల ఫీచర్లు డిజైన్ అంశాలను ఏ మాత్రం గమనించకుండా ఉండేందుకు పూర్తిగా నల్లటి స్టిక్కర్లతో భద్రం చేశారు. మూడవ వరుసలో ఉత్తమ సీటింగ్ సామర్థ్యాన్నికలిగించే విధంగా దీని డిజైన్ కలదు.

సాంకేతికంగా ఈ సరికొత్త ఎమ్‌పివిలో 2.2-లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌ను అందించనున్నారు. ఇది సుమారుగా 140బిహెచ్‌పి పవర్ మరియు 330ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

అయితే 1.99-లీటర్ వెర్షన్‌లో ఉన్న డీజల్ ఇంజన్ కూడా ఇందులో వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇది 140బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

మహీంద్రా తమ స్కార్పియోలో అందివ్వనున్న పెట్రోల్ ఇంజన్‌ను ఈ సరికొత్త ఎమ్‌పివిలో కూడా అందించే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








