ఎప్రిల్ మొదటి వారంలోకి దేశీయ మార్కెట్లోకి మరొక కొత్త వాహనాన్ని విడుదల చేయనున్న మహీంద్రా
మహీంద్రా అండ్ మహీంద్రా వారు ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తున్న సరికొత్త ఎస్‌యువి పేరును ప్రకటించింది మరియు దీని విడుదల తేదీని కూడా ఖరారు చేసింది.

మహీంద్రా అండ్ మహీంద్రా దీనిని తమ క్వాంటో రేంజ్ స్థానంలో ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో విసృత స్థాయి ఎస్‌యువి వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. అందులో 4.5 లక్షలు నుండి 25 లక్షల రేంజ్ వరకు ఉంటాయి అని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ ముఖ్య కార్యనిర్వహణా అధికారి ప్రవీణ్ సాహ్ తెలిపారు.
Also Read: మహీంద్రా అండ్ మహీంద్రా వారి నువోస్పోర్ట్ యొక్క ఇంజన్ మరియు ఇతర వివరాల కోసం
ఈ నూతన నువోస్పోర్ట్ ఎస్‌యువిలోని అందించిన ముందు వైపు ఫ్రంట్ గ్రిల్ మరియు హెడ్ లైట్లు స్కార్పియో నుండి సేకరించారు. అదే విదంగా వీటికి అదనంగా పగటి పూట వెలిగే లైట్లను కల్పించారు. ఇక ప్రక్క వైపున డిజైన్‌లో భాగంగా ప్లాస్టిక్ క్లాడింగ్ గల 10 స్పోక్ అల్లాయ్ వీల్స్ కలవు. వెనుక వైపున అద్దం వంటి రూపంలో ఉన్న గ్లాస్ లెన్స్ టెయిల్ లైట్లను గమనించవచ్చు.
- ఈ నువోస్పోర్ట్ ఎస్‌వియు ప్రారంభ ధర రూ. 7 లక్షల ఎక్స్ షోరూమ్‌గా ఉండవచ్చు.


Click it and Unblock the Notifications








