దేశీయ మార్కెట్లోకి మహీంద్రా వారి నువోస్పోర్ట్ విడుదల: మరిన్ని వివరాలకు
ఎస్‌యువిల మీద మాత్రమే దృష్టిసారించినట్లు అదేపనిగా ఎస్‌యువి వాహనాలను మాత్రమే తయారు చేస్తున్న మాహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎస్‌యువి నువోస్పోర్ట్‌ను విడుదల చేసింది. మహీంద్రా టియువి300 తరువాత ఇండియన్ మార్కెట్లోకి అందించిన రెండవ నాలుగు మీటర్లు పొడవున్న ఎస్‌యువి ఈ నువోస్పోర్ట్.
ప్రారంభంలో మహీంద్రా క్వాంటోను మార్కెట్లోకి అందించింది, దీనికి బదులుగా ఈ నువోస్వోర్ట్ ఎస్‌యువిని తీసుకువచ్చినట్లు తెలిపారు. నువోస్పోర్ట్ ఎస్‌యువి గురించి పూర్తి వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ఇంజన్ వివరాలు
మహీంద్రా అండ్ మహీంద్రా ఈ సరికొత్త నువోస్పోర్ట్ ఎస్‌యువిలో 1.5-లీటర్ కెపాసిటి గల టర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌ను అందించింది. ఇది దాదాపుగా 100 బిహెచ్‌పి పవర్ మరియు 240 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ట్రాన్స్‌మిషన్
మహీంద్రా వారి నువోస్పోర్ట్ ఎస్‌యువిలో 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను అందించారు.

డ్రైవింగ్ మోడ్స్
మహీంద్రా ఇందులో రెండు డ్రైవింగ్ మోడ్స్‌ను అందించింది. అవి
- ఎకో మోడ్
- పవర్ మోడ్
- మోల్టెన్ రెడ్
- రస్ట్ ఆరేంజ్
- డైమండ్ వైట్
- రీగాల్ బ్లూ
- మిస్ట్ సిల్వర్
- ఫిరి బ్లాక్
- ఎన్ 4 ధర రూ. 7,35,000
- ఎన్ 4 ప్లస్ ధర రూ 7,65,000
- ఎన్ 6 ధర రూ. 8,36,000
- ఎన్ 6 ఆటోమేటిక్ ధర రూ. 9,00,000
- ఎన్ 8 ధర రూ. 9,12,000
- ఎన్ 8 ఆటోమేటిక్ ధర రూ. 9,76,000
- ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన మిలిటరీ వాహనాలను కలిగిన దేశాలు
- హ్యుందాయ్‌ను అధిగమించిన రెనో క్విడ్ తరువాత మారుతి వంతు
- ఏప్రిల్ 6 న దేశ వ్యాప్తంగా విడుదల కానున్న టాటా టియాగో

మైలేజ్
ఇందులోని ఇంజన్ మరియు 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ సహాయంతో లీటర్‌కు 17.45 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలదు.

డిజైన్
మహీంద్రా ఈ నువోస్పోర్ట్ వాహనం చాలా వరకు క్వాంటో పోలికలతో ఉంది. అయితే దీనికి ముందు వైపున చాలా వరకు స్కార్పియోను పోలి ఉంటుంది. పెద్ద పరిమాణంలో ఉండే ఎయిర్ ఇంటేకర్ మరియు చిన్న పరిమాణంలో ఉండే ఫ్రంట్ గ్రిల్ ఇందులో కలదు. దీనిని తీక్షణంగా గమనిస్తే రెండు కూడా స్కార్పియోలో గుర్తుపట్టవచ్చు.

ఇందులో కొత్తవి
నువోస్పోర్ట్‌కు ముందు వైపున డిజైన్ చేసిన హెడ్ ల్యాంప్స్ స్కార్పియో కన్నా భిన్నంగా ఉంటాయి. అయితే అన్నింటిలా పగటి పూట వేలిగే లైట్లను హెడ్ లైట్లలో భాగంగా కాకుండా ప్రత్యేకంగా హెడ్‌లైట్లకు పై భాగంలో కనుబొమ్మల్లా డిజైన్ చేశారు.

ప్లాస్టిక్ క్లాడింగ్
మహీంద్రా అండ్ మహీంద్రా ఈ నువోస్పోర్ట్ మరింత కఠినమైనదిలా కనబడటానికి నాలుగు వైపుల కూడా ప్లాస్టిక్ క్లాడింగ్ కల్పించారు.

ఫీచర్లు
ఇందులో ముందు మరియు వెనుక వైపున మల్టీ స్పోక్స్ అల్లాయ్ వీల్స్, క్లియర్ గ్లాస్ లెన్స్‌లు గల టెయిల్ ల్యాంప్స్ కలవు.

ఇంటీరియర్
డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌లో లెథర్ సీట్లు మరియు ప్రీమియమ్ లుక్ మరియు అనుభూతి కోసం దీని లోపల క్రోమ్ డిజైన్ పరకరాలు కల్పించారు.

ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్
నువోస్పోర్ట్‌లో 6.2-అంగుళాల తాకే తెర పరిమాణం గల ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ కలదు. ఇది బ్లూటూత్, ఏయుఎక్స్ అలాగే హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ వంటి వాటిని సపోర్ట్ చేస్తుంది.

బూట్ స్పేస్
ఇందులో బూట్ స్పేస్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో ఎక్కువ పొడవు మరియు వెడల్పు ఉండే విధంగా 412- లీటర్ల కెపాసిటి గల బూట్ స్పేస్ కల్పించారు.

భద్రత
మహీంద్రా భద్రత పరంగా నువోస్పోర్ట్ ఎస్‌యువిలో రెండు ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లు కలవు. ఈ అన్ని భద్రత ఫీచర్లు నువోస్పోర్ట్‌లోని అన్ని వేరియంట్లలో కూడా ఆప్షనల్‌గా అందిస్తున్నారు.

లభించు రంగులు
నువోస్పోర్ట్ ఎస్‌యువి ఆరు రంగుల్లో లభించును

అందుబాటులోకి
ప్రస్తుతం ఈ నువోస్పోర్ట్ ఎస్‌యువి దేశవ్యాప్తంగా ఉన్న మహీంద్రా డీలర్ షిప్‌ల వద్ద అమ్మకాలకు సిద్దంగా అందుబాటులో ఉంది.

పోటి
మహీంద్రా నువోస్పోర్ట్ ఎస్‌యువి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి వారి వితారా బ్రిజా, ఫోర్డ్ ఎకో స్పోర్ట్ లకు పోటిగా నిలవనుంది. ఆకర్షణీయమైన ధరలు మరియు ఫీచర్ల ద్వారా వినియోగదారులను ఇది ఆకర్షిస్తుంది.

మహీంద్రా నువోస్పోర్ట్ ధరలు వేరియంట్‌ల వారిగా

అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ థానే గా ఇవ్వబడ్డాయి.



Click it and Unblock the Notifications








