మహీంద్రా నుండి మరొకటి: నువోస్పోర్ట్ పేరుతో క్వాంటో ఫేస్‌లిఫ్ట్
మహీంద్రా అండ్ మార్కెట్లోకి కెయువి100 ఎస్‌యువిని మార్కెట్లోకి విడుదల చేసి కనీసం నాలుగు నెలల కాలం కూడా గడవకముందే మరొక కొత్త వాహనాన్ని పరిచయం చేయనుంది. మహీంద్రా వారి క్వాంటో వాహనాన్ని ఫేస్‌లిఫ్ట్ ఎడిషన్‌లో మార్కెట్లోకి విడుదల చేయాలని చూస్తోంది. అయితే తాజాగా దీనికి నువోస్పోర్ట్ అనే పేరు పెట్టారు.
ఈ సరికొత్త నువోస్పోర్ట్ నాలుగు మీటర్ల సబ్‌కాంపాక్ట్ ఎస్‌యువికి చెందిన ఫోటోలు మరియు ఇతర వివరాలు ఆన్‌లైన్లో తెగ సందడి చేశాయి. వాటిని వివరంగా క్రింది కథనంలో అందించాము.

ఓవర్‌డ్రైవ్ అనే వెబ్‌సైట్ కథనం ప్రకారం క్వాంటో పేరుకు బదులుగా మహీంద్రా నువోస్పోర్ట్ అనే పేరును పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి ముందు వైపున కనుబొమ్మలు వంటి పగటి పూట వెలిగే లైట్లను అందించారు. ముందు డిజైన్ కన్నా ఈ నువోస్పోర్ట్ ఫ్రంట్ గ్రిల్ ఎంతో కాంపాక్ట్ మరియు యాంగులర్‌గా అనిపిస్తుంది.

మహీంద్రా దీనికి కొత్త మెరుగులు ఎక్కువగా దిద్దారని తెలుస్తోంద అందులో ముందు వైపున సరికొత్త ఫాగ్ ల్యాంప్స్, బ్యానెట్ మీద స్పోర్ట్ డిజైన్ స్కూప్స్, సరికొత్త అల్లాయ్ వీల్స్ మరియు డోర్ క్లాడింగ్ వంటివి ఇందులో ఉన్నాయి. ఏ యాంగిల్‌లో చూసినా ఇది ఆఫ్ రోడ్ వెహికల్‌ను పోలి ఉంటుంది.

వెనుక వైపున మనం నలుపు రంగు చివరిలో టెయిల్ ల్యాంప్స్ మరియు సరికొత్త నువోస్పోర్ట్ పేరుతో బ్యాడ్జిను మనం గమనించవచ్చు.

సరికొత్త నువోస్పోర్ట్ ఎస్‌యువిలో 1.2-లీటర్ mHawk100 ఇంజన్ కలదు.

ఈ ఇంజన్ 5-స్పీడ్ ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా అందుబాటులో ఉండనుంది.

అయితే డీజల్ వేరియంట్ కోసం మహీంద్రా ప్రస్తుతం తమ దగ్గర ఉన్న 1.5-లీటర్ ఇంజన్‌ను ఈ నువోస్పోర్ట్‌లో అందివ్వనున్నారు.

మహీంద్రా ఈ నువోస్పోర్ట్‌లో ఎస్‌యువిలో క్వాంటోలోని 7-సీట్ల సామర్థ్యాన్ని దీనికి కూడా అన్వయించనున్నారు.

నువోస్పోర్ట్ టాప్ వేరియంట్లో క్రూయిజ్ కంట్రోల్, డబుల్-డిఐఎన్ తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థను అందించారు.

మహీంద్రా అండ్ మహీంద్రా వారి నువోస్పోర్ట్ ధరలు 5.5 లక్షలు నుండి 8.5 లక్షలు ఎక్స్ షోరూమ్ మధ్య ఉండనుంది.

మహీంద్రా అండ్ మహీంద్రా ఈ సరికొత్త నువోస్పోర్ట్ ఈ 2016 మార్చి చివరికల్లా విడుదల చేయనుంది.

ఏడు సీట్ల సామర్థ్యంతో అందుబాటులోకి వస్తున్న నువోస్పోర్ట్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మారుతి సుజుకి ఎర్టిగా మరియు జనరల్ మోటార్స్ వారి అప్‌కమింగ్ షెవర్లే స్పిన్ వాహనాలకు పోటిగా నిలవనుంది.

- అమేజ్...! హోండా వారి అమేజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల ప్రారంభ ధర రూ. 5.29 లక్షలు
- భారత్‌లో అత్యంత రద్దీ గల టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాలు
- మహీంద్రా మరియు ఫ్లిప్ కార్ట్ సంయుక్తంగా 21,000 బుకింగ్స్ కొల్లగొట్టారు.


Click it and Unblock the Notifications








