మహీంద్రా నుండి మిని బొలెరొ కాంపాక్ట్ ఎస్‍యువి
భారత దేశపు వాహన తయారీ దిగ్గజం ఇండియన్ మార్కెట్లోకి కెయువి100, టియువి300 మరియు నువోస్పోర్ట్ వంటి వాహనాల తర్వాత ఇదే శ్రేణిలో నాలుగవ వాహనాన్ని అందివ్వడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న బొలెరొ వాహనాన్ని మిని బొలెరొగా కాంపాక్ట్ ఎస్‌యువి రూపంలోకి మార్చి మన ముందుకు తీసుకురానున్నారు.

ప్రముఖ వార్తా సంస్థ ఆటో కార్ ఇండియా కథనం మేరకు, మహీంద్రా వారి తమ పాపులర్ ఎస్‌యువి ఆధారంగా కాంపాక్ట్ ఎస్‌యువి రూపంలో మిని బొలెరొని తయారు చేయనుంది. సరికొత్త మిని బొలెరొలో 1.5-లీటర్ మూడు సిలిండర్ల టర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌ను అందివ్వనున్నారు, ఉత్తమ మైలేజ్ ఇవ్వగలిగే ఇది 68బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.
దీనికి ముందు వైపున ఉన్న పొడవును తగ్గించి నాలుగు మీటర్ల మార్క్‌లో అందివ్వనున్నారు. తద్వారా మూడవ వరుసలో సీటింగ్‌ను అందించి నువోస్పోర్ట్ మరియు టియువి300 తరహాలో డిజైన్ చేయనున్నారు. తద్వారా లగేజ్ తీసుకెళ్లే వెసులు బాటు కూడా ఉండనుంది.
Also Read: రహస్యాల కోట ఏరియా 51 గురించి ఆసక్తికరమైన విషయాలు...!!
మిని బొలెరో ఇంటీరియర్ లోపల ప్రస్తుతం ఉన్న బొలెరొలోని అన్ని ఫీచర్లను ఇందులో రానున్నాయి. డ్యాష్ బోర్డ్ మరియు తమ ఎస్‌యువి శ్రేణిలో ఉన్న ఇంటీరియర్ ఫీచర్లను ఇందులో కూడా అందిచనున్నారు.


Click it and Unblock the Notifications








