మహీంద్రా టియువి300 ను కొన్నారా, అయితే ఇది గమనించారా ?
మహీంద్రా అండ్ మహీంద్రా వారి టియువి300 లోని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎస్‌యువి వాహనాలు రీకాల్ అయ్యాయి. కాని ఈ విషయం గురించి మహీంద్రా అండ్ మహీంద్రా అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే గుట్టు చప్పుడు కాకుండా తమ డీలర్ల వద్ద ఉన్న టియువి300 వాహనాలను రీకాల్ చేశారు.
Also Read: చాటుగా తిరుగుతున్న మహీంద్రా క్యాంటో శుభ్రంగా కెమెరాకు చిక్కింది: ఫోటోలు
ఇలా గుట్టు చప్పుడు కాకుండా రీకాల్ ప్రకటించడం వెనుక ఉన్న అంతరంగం ఏమిటి? ఒక వేళ ఆ లోపం మీ టియువి300 లోకూడా ఉన్నట్లయితే ఏం చేయాలి మొత్తానికి రీకాల్ కు గల ముఖ్య కారణం ఏమిటి ప్రశ్నలకు సమాదానం క్రింది కథనం ద్వారా తెలుసుకుందా రండి.

టియువి300 వాహనంలోని ఇంజన్ 4,000 ఆర్‌పిఎమ్ వద్ద ఉన్నప్పుడు గేరును మార్చినట్లయితే వాహనం మొత్తం అదుర్లకు గురిఅవుతోంది.

ఇలా సమస్య ఉన్న వాహనలలో ఇసియు వ్యవస్థను అందిచడం ద్వారా ఇటువంటి వాటిని నివారించవచ్చు.

మహీంద్రా వారి టియువి300 ఇంజన్ పరంగా మంచి వ్యవస్థను కలగి ఉంది. ఇందులో 1.5-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల ఎమ్‌హాక్80 డీజల్ ఇంజన్ కలదు

మహీంద్రా టియువి300 లోని ఇంజన్ అత్యధికంగా 84 బిహెచ్‌పి పవర్ మరియు 230 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

మహీంద్రా వారి టియువి300 వాహనం 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ మాట్లాడుతూ, మహీంద్రా లోని టియువి300 లో గల ఆటోమేటిక్ వాహనాలను దాదాపుగా 50 శాతం ఎక్కువగా బుక్ చేసుకున్నారని తెలిపారు.

మహీంద్రా వారు ఈ మధ్యనే విడుదల చేసిన కెయువి 300 దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతోంది.
- మహీంద్రా కెయువి300 పూర్తి విమర్శ (కంప్లీట్ రివ్యూ) కోసం
- మహీంద్రా కెయువి300 గ్యాలరీ: అంతర, బాహ్య ఫోటోలు


Click it and Unblock the Notifications








