స్కార్పియో అడ్వెంచర్ ఎడిషన్‌ను విడుదల చేసిన మహీంద్రా
మహీంద్రా అండ్ మహీంద్రా తమ ఉత్తమ ఎస్‌యువి వాహనం స్కార్పియోను సరికొత్త అడ్వెంచర్ ఎడిషన్‍లో పరిచయం చేసింది. దేశ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన స్పెషల్ ఎడిషన్ స్కార్పియో అనుకోకుండా గోవాలో విడుదల కాలేకపోయింది. అయితే 13.38 లక్షలు అత్యంత ఆకర్షణీయమైన ప్రారంభ ధరతో విడుదలైంది. దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో...

స్కార్పియో అడ్వెంచర్ ఎడిషన్‌లో అత్యంత శక్తివంతమైన 2.2 లీటర్ ఎమ్‌హాక్ డీజల్ ఇంజన్‌ను అందించారు.

దీని శక్తి సామర్థ్యాల గురించి ప్రస్తావిస్తే ఇందులోని ఇంజన్ సుమారుగా 120 బిహెచ్‌పి పవర్ మరియు 280 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా సంస్థ ఈ స్కార్పియో స్పెషల్ ఎడిషన్‌ను ఫ్రంట్ వీల్ డ్రైవ్ మరియు ఆల్ వీల్ డ్రైవ్‌ను అప్షనల్‌గా అందిస్తోంది.

మనం ఎన్నడూ చూడని విధంగా సిల్వర్ మరియు వైట్ పెయింట్ స్కీమ్‌తో కూడిన్ డీకాల్స్ సొబగులతో వచ్చింది. హెడ్ ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్ కొంచెం సాధారణంగానే అనిపిస్తాయి.

ఇందులోని అల్లాయ్ వీల్స్‌ను గన్ మెటల్‌తో రూపొందించారు. ఇక బ్రేక్ కాలిపర్స్‌ను ఎంతో ఆకర్షణీయంగా ఎరుపు రంగులో డిజైన్ చేశారు.

ఇంటీరియర్‌లోని క్యాబిన్ పరంగా చూస్తే డ్యూయల్ టోన్ డ్యాష్ బోర్డ్, సరికొత్త ఆరు అంగుళాల తాకే తెర పరిమాణం గల ఇన్పోటైన్‌మెంట్ వ్యవస్థ వంటివి కలవు.

అంతే కాకుండా ఇంటీరియర్‌లో నీలం రంగు తొడుగులు గల ఫాక్స్ లెథర్ సీట్లు, లెథర్ తొడుగు గల స్టీరింగ్ వీల్ మరియు లెథర్ తొడుగుతో ఉన్న గేర్ నాబ్ ఇందులో ఉన్నాయి.

స్కార్పియో స్పెషల్ ఎడిషన్‌ను మహీంద్రాలోని స్కార్పియో ఎస్10 వేరియంట్ ఆధారంగా డిజైన్ చేశారు.

దేశవ్యాప్తంగా ఉన్న మహీంద్రా వారి షోరూమ్‌లలో లిమిటెడ్ ఎడిషన్‌గా కేవలం 1000 యూనిట్లను మాత్రమే అమ్మకాలకు అందుబాటులో ఉంచారు.

క్రూయిజ్ నౌకల ప్రయాణం వెనుకున్న 10 చీకటి రహస్యాలు
ప్రపంచ వ్యాప్తంగా గరిష్ట దూరం ప్రయాణించే రైళ్లు


Click it and Unblock the Notifications








