మహీంద్రా స్కార్పియో గేట్‌వే ను ఈ రూపంలో ఎప్పుడైనా చూశారా ?
ముంబాయ్ ఆధారిత ప్రముఖ వాహనాల కస్టమైజేషన్ సంస్థ ఎస్‌పి డిజైన్ మహీంద్రా స్కార్పియో గేట్‌వే ను 6X6 వెర్షన్‌లో రూపొందించిన ఫోటోలను విడుదల చేసింది.
వినియోగదారులు కోరినట్లుగా వాహనాలను కస్టమైజ్ చేసే ముంబాయ్ ఆధారిత ప్రముఖ వాహనాల కస్టమైజేషన్ సంస్థ ఎస్‌పి డిజైన్ మహీంద్రా స్కార్పియో గేట్‌వేను 6X6 వెర్షన్‌లో కస్టమైజ్ చేసిన ఫోటోలను విడుదల చేసింది.

మూడు యాక్సిల్స్ ఉన్న ఆఫ్ రోడ్ వాహనం అంటే మనకు మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి 6X6 గుర్తుకు వస్తుంది. అయితే దీనిని ఇండియాకు దిగుమతి చేసుకోవాలంటే తడిసిమోపెడవుతుంది. ఈ తతంగమంతా ఎందుకునున్నారో మహీంద్రా స్కార్పియో గేట్‌వే ఎస్‌యువిని ఇలా మార్చేశారు.

ముంబాయ్‌కు చెందిన ప్రముఖ వాహనాల కస్టమైజేషన్ సంస్థ ఎస్‌పి డిజైన్ మహీంద్రా స్కార్పియో గేట్‌వే ను ఒక కొత్త డిజైన్ రుచిలో భారతీయులకు పరిచయం చేసారు.

ఆఫ్ రోడింగ్‌లో అత్యుత్తమ పనితీరును కనబరచడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కస్టమైజేషన్ సంస్థలు జీప్, ఫోర్డ్ రాప్తర్లు, హమ్మర్ వాహనాలను కస్టమైజ్ చేసి చివరిలో అదనంగా మరో యాక్సిల్‌ను అందిస్తుంటాయి.

పాశ్చాత్య దేశాల్లో పురుడుపోసుకున్న ఈ కస్టమైజేషన్ ఇప్పుడు దేశీయంగా అదే జోరును కొనసాగిస్తోంది. మొదటగా 2014 లో పంజాబ్ ఆధారిత కస్టమైజేషన్ సంస్థ సిడి ఆఫ్ రోడర్స్ మహీంద్రా థార్ వాహనాన్ని 6X6 వెర్షన్‌లో పరిచయం చేసింది.

నేలను సైతం చీల్చుకుంటూ వెళ్లే 6X6 వెర్షన్ గల వాహనాల కస్టమైజేషన్ అంతటితో ఆగలేదు, ఆ ధోరణి అలాగే కొనసాగి ఇప్పుడు ముంబాయ్ ఆధారిత ఆఫ్ రోడింగ్ వాహనాల అభివృద్ది సంస్థ ఎస్‌పి డిజైన్ మహీంద్రా స్కార్పియో గేట్‌వేను 6X6 వెర్షన్‌లో కస్టమైజ్ చేసింది.

స్కార్పియో గేట్‌వే వాహనం చూడటానికి పొడవుగా ఆఫ్ రోడింగ్ ఎస్‌యువి తరహాలోనే ఉంటుంది. అయితే మరో యాక్సిల్‌ను జోడించి అదనంగా రెండు ఆఫ్ రోడింగ్ చక్రాలను అందిస్తే దేశీయ ఆఫ్ రోడింగ్ వాహనంగా ముద్రవేసుకోవడం గ్యారంటీ. ఇది ఇంకా ఆలోచనల్లోనే ఉంది. కార్యరూపం దాల్చడానికి ఇంకా సమయం ఉంది.

మహీంద్రా గేట్‌వే ఇప్పుడు 2-వీల్ డ్రైవ్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌లతో ఉంది. కస్టమైజేషన్ పూర్తయితే 6-వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా అందుబాటులోకి వస్తుంది.

మహీంద్రా స్కార్పియోగేట్‌వే వాహనంలో 2.6-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బో ఛార్జ్‌డ్ సిఆర్‌డిఇ డీజల్ ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 115బిహెచ్‌పి పవర్ మరియు 277ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. 6-వీల్ డ్రైవ్ ఉన్నపుడు అన్ని చక్రాలకు చేరే పవర్ మరియు టార్క్ మరింత అధికమయ్యే అవకాశం ఉంది.

- సన్‌రూఫ్ ను కలిగి ఉన్న టాప్-10 ఇండియన్ కార్లు
- మంచి రీ సేల్ వ్యాల్యూ అంటే వీటిదే
- భద్రత పరంగా భారతీయ మార్కెట్లో ఉన్న బెస్ట్ కార్లు


Click it and Unblock the Notifications








