మహీంద్రా స్కార్పియో ఇంటెల్లీ హైబ్రిడ్ విడుదల: ధర రూ. 9.35 లక్షలు

By N Kumar

ఢిల్లీ మరియు కేంద్ర రాజధాని ప్రాంత పరిధిలో 2000సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం గల డీజల్ వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేసినపుడు ఎక్కువ నష్టపోయిన వాటిలో మహీంద్రా ఒకటి. అయితే రద్దును తొలగించిన తరువాత మహీంద్రా అమ్మకాలు తిరిగి పుంజుకున్నాయి. ఇదే జోరు మీద మహీద్రా అండ్ మహీద్రా తమ స్కార్పియో ఇంటెల్లీ హైబ్రిడ్ (Scorpio Intelli-Hybrid technology) వాహనాన్ని ఢిల్లీలో విడుదల చేసింది.

మహీంద్రా స్కార్పియో ఇంటెల్లీ హైబ్రిడ్

సుప్రీం కోర్టు నిషేధాన్ని ప్రకటించిన కొద్ది కాలానికే ఢిల్లీ కోసం ప్రత్యేకంగా 1.99సీసీ సామర్థ్యం గల డీజల్ ఇంజన్‌ను అభివృద్ది చేసి స్కార్పియోలో అందించిన విషయం తెలిసిందే.

మహీంద్రా స్కార్పియో ఇంటెల్లీ హైబ్రిడ్

ప్రస్తుతం దేశీయ దిగ్గజ ఎస్‌యువి వాహనాల తయారీ సంస్థ మహీంద్రా ఢిల్లీ మార్కెట్లోకి ఇంటెవల్లీ సాంకేతిక పరిజ్ఞానం గల స్కార్పియో ఎస్‌యువి(ఎస్4)ని రూ. 9.35 లక్షలు ప్రారంభ ధరతో విడుదల చేసింది.

మహీంద్రా స్కార్పియో ఇంటెల్లీ హైబ్రిడ్

మహీంద్రా ఈ స్కార్పియో ను 5 శాతం వ్యాట్‌తో అందుబాటులోకి తెచ్చింది కాబట్టి వినియోగాదారులు సుమారుగా 60,000 రుపాయల వరకు లాభ పడే అవకాశాలు ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో ఇంటెల్లీ హైబ్రిడ్

మహీంద్రా ఇందులో పరిచయం చేసిన ఇంటెల్లీ హైబ్రిడ్ సాంకేతికత ద్వారా సాధారణ స్కార్పియోతో పోల్చుకుంటే 7 శాతం ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది.

మహీంద్రా స్కార్పియో ఇంటెల్లీ హైబ్రిడ్

ఇంటెల్లీ హైబ్రిడ్ టెక్నాలజీ పనితీరు: మూడు సెకండ్ల కన్నా ఎక్కువ సేపు వాహనాన్ని ఆపి ఉంచినపుడు ఇంజన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. ఎప్పుడైతే క్లచ్‌ను లోతుగా ప్రెస్ చేస్తారో అప్పుడు ఇంజన్ ఆన్ అవుతుంది.

మహీంద్రా స్కార్పియో ఇంటెల్లీ హైబ్రిడ్

ఉత్తమ మైలేజ్ కోసం మాత్రమే కాకుండా ఇందులో వినియోగించిన సాంకేతికత ద్వారా బ్రేక్‌లను వినియోగించినపుడు విడుదలయ్యే శక్తి బ్యాటరీని చార్జ్ చేస్తుంది.

మహీంద్రా స్కార్పియో ఇంటెల్లీ హైబ్రిడ్

సాంకేతికంగా మహీంద్రా ఇందులో 1.99సీసీ సామర్థ్యం గల టర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌ను అందించింది. ఇది సుమారుగా 120బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయును.

మహీంద్రా స్కార్పియో ఇంటెల్లీ హైబ్రిడ్

ఫీచర్ల పరంగా ఇందులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, కనుబొమ్మల శైలిలో ఉన్న ఎల్‌ఇడి పార్కింగ్ లైట్లు, ఆరు అంగుళాల తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, జిపిఎస్ న్యావిగేషన్, పూర్తి స్థాయిలో ఆటోమేటిక్ వాతావరణ నియంత్రణ వ్యవస్థ, నీలం మరియు గ్రే రంగుల్లో ఇంటీరియర్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్.

మహీంద్రా స్కార్పియో ఇంటెల్లీ హైబ్రిడ్

సరికొత్త స్కార్పియో ఇంటెల్లీ-హైబ్రిడ్ స్కార్పియో ఏడు వేరియంట్లలో అందుబాటులో కలదు. అవి,

ఎస్4, ఎ4+, ఎస్4+ ఫోర్ వీల్ డ్రైవ్, ఎస్6+, ఎస్8, ఎస్10-2 వీల్ డ్రైవ్ మరియు ఎస్10-4 వీల్ డ్రైవ్.

మహీంద్రా స్కార్పియో ఇంటెల్లీ హైబ్రిడ్

  • భారత్‌కు పొంచి ఉన్న ముప్పు....!!
  • పాక్ ఉగ్ర మూకల అంతం కోసం బృహత్తర ప్రణాళిక
  • లగ్జరీ నౌకల్లో మానవాళికి తెలియని భయంకర రహస్యాలు

More from DriveSpark

Article Published On: Wednesday, September 28, 2016, 15:09 [IST]
English summary
Read In Telugu: Mahindra Launches Intelli-Hybrid Technology For The Scorpio In Delhi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+