తక్కువ సైజులో సరికొత్త బొలెరో: మహీంద్రా అండ్ మహీంద్రా అనుకోని ఆవిష్కరణ
భారత దేశపు ఆటోమొబైల్ రంగంలో గల మహీంద్రా అండ్ మహీంద్రా అత్భుతమైన ఇంజనీర్లను కలిగి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే రెండు నెలలో క్రితం ఢిల్లీలో 2000సీసీ పైన కెపాసిటి గల వాహనాల రిజిస్ట్రేషన్లకు బ్రేకులు పడిని సంగతి తెలిసిందే. అయితే మహీంద్రా వారి స్కార్పియో మరియు ఎక్స్‌యూవీ500 వాహనాల మీద ప్రభావం పడితే అతి తక్కువ కాలంలో ఢిల్లీ ప్రజలకు 2000సీసీ కన్నా తక్కువ కెపాసిటి గల ఇంజన్‌ను రెండు వాహనాలలో అందించింది. ఇదీ మహీంద్రా వద్ద ఉన్న ఇంజనీర్ల యొక్క పనితీరు.
అయితే ఇప్పుడు వాహనాల కొలతల పరంగా ట్యాక్స్‌లు రానుండటంతో మహీంద్రా అండ్ మహీంద్రా తమ బొలెరో వాహనాన్ని అన్ని అంశాల పరంగా రీ డిజైన్ చేయడానికి పూనుకుంది. అయితే దీనికి సంభందించిన మోడిఫికేషన్ పనులు ఇప్పటికే మహీంద్రా ఇంజనీర్లు ప్రారంభించారు. మహీంద్రా వారి నూతన బొలెరో గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ఎక్కువ సైజులో ఉన్న ఎస్‌యువి వాహనాలకు టాక్స్ పరంగా వినియోగదారుల మీద అధిక ట్యాక్స్ భారం పడే అవకాశాలు ఉన్నాయి. ఈ దిశగా కొన్ని చర్యలు కూడా జరుగుతున్నాయి. అందుకోసం మహీంద్రా అండ్ మహీంద్రా తమ బొలెరో వాహనాన్నితక్కువ సైజు వచ్చే విధంగా మరలా రూపొందిస్తున్నారు.

మహీంద్రా అండ్ మహీంద్రా బొలెరో వాహనాన్ని నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవుతో తయారు చేయాలని ప్రతిపాదించుకుంది.

ఈ నాలుగు మీటర్లు పొడవు గల బొలెరో వాహనానికి తగ్గట్లుగా 1.5-లీటర్ కెపాసిటి ఉండేటట్లు స్పోర్టివ్ ఇంజన్‌ను అభివృద్ది చేస్తున్నారు.

ప్రస్తుతం బొలెరో ఎస్‌యువి 4.17 మీటర్లు పొడవు మరియు 2.5-లీటర్ కెపాసిటి గల ఇంజన్‌ను కలిగి ఉంది.

అంతర్గతంగా మహీంద్రా అండ్ మహీంద్రా ఈ బొలెరో వాహనానికి యు108 అనే కోడ్ పేరును పెట్టుకుంది.

మహీంద్రా అండ్ మహీంద్రా ప్రస్తుతం నాలుగు మీటర్లు పొడవున్న యుటిలిటి వాహనాల పరిధిని బొలెరో, టియువి300, కెయువి 100 మరియు అతి త్వరలో విడుదల కానున్న నువోస్పోర్ట్ లకు విస్తరించనుంది.

మహీంద్రా అండ్ మహీంద్రా ఈ నువోస్పోర్ట్ వాహనాన్ని ఈ ఏడాది తొలిసగానికల్లా మార్కెట్లోకి తీసుకురానుంది. మరియు వీటని ప్రతి ఏడాది కూడా 25,000 యూనిట్ల అమ్మకాల లక్ష్యంగా పెట్టుకుంది.

మహీంద్రా అండ్ మహీంద్రా రహస్యంగా అభివృద్ది చేస్తున్న ఈ నయా బొలెరో ఎస్‌యువి 2018-2019 మధ్య పూర్తిగా సిద్దమై మన ముందుకు రానున్నట్లు సమాచారం.

- 2016 సంవత్సరానికి గాను బేస్ వేరియంట్లలో ఉన్న బెస్ట్ కార్లు
- లండన్ వీధుల్లో బంగారు కార్లలో ఊరేగింపుగా వచ్చిన సౌదీ బిలియనీర్


Click it and Unblock the Notifications








