రెండు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్న మహీంద్రా
ఇండియన్ మార్కెట్లోకి విసృత స్థాయిలో వాహనాలను అందిస్తోన్న అతి పెద్ద వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా వారు ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా మహీంద్రా ఈ ఏడాది చివరి నాటికి ఇండియన్ మార్కెట్లోకి రెండు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

ప్రస్తుతం మహీంద్రాకు చెందిన రెండు ఎలక్ట్రిక్ కార్లు ఇ2ఒ మరియు వెరిటో లు అందుబాటులో ఉన్నాయి.

ఫేమ్ ఇండియా వేదిక మీద రెండవ జాతీయ వర్క్‌షాప్ మరియు ఎగ్జిబిషన్ లో మహీంద్రా రెవా సీనియర్ జనరల్ మేనేజర్ పవన్ సచిదేవ్ మాట్లాడుతూ, ఇండియన్ మార్కెట్లోకి ఈ ఏడాది చివరికి రెండు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఎటువంటి పోటీ ఉత్పత్తులు లేని నేపథ్యంలో మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.

గడిచిన 2015 ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన కార్ల అమ్మకాల్లో 42 శాతం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు జరగియి, అదే ఇండియాలో కేవల 752 ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి.

చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి మరియు అమ్మకాల మీద ట్యాక్స్ తగ్గంచడంతో సుమారుగా 1,76,627 యూనిట్లు అమ్ముడుపోయాయి.

ఇండియాలోకి విడుదల కానున్న రెండు విద్యుత్ కార్లలో ఒక దానిని సుప్రో వ్యాన్ పేరుతో ఢిల్లీలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించారు.

ఆటో ఎక్స్ పో వేదిక మీద కనువిందు చేసిన ఇందులో 73.2 వోల్ట్ ఆల్టర్నేటివ్ కరెంట్ ఇండక్షన్ మోటార్‌ను అందించారు.

ఇందులోని మోటార్ అత్యధికంగా 40బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇ సుప్రో అనే పేరుతో రానున్న సరికొత్త ఎలక్ట్రిక్ వాహనంలో ఎనిమిది మందికి సీటింగ్ సామర్థ్యాన్ని కల్పించనున్నారు.

మహీంద్రా ఈ ఇ సుప్రో ను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.
(ఇ సుప్రోకు చెందిన ఫోటోలు ఇంకా విడుదల కాలేదు, ఇవి కేవల మీ రెఫరెన్స్ కోసం మాత్రమే) మరిన్ని ఆటోమొబైల్ వార్తల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌తో కలిసి ఉండండి.

- విదేశాల్లో ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో వాహనాలు నడిపితే ఇవి పాటించండి


Click it and Unblock the Notifications








