టయోటా ఇన్నోవా క్రిస్టాకు పోటీగా మహీంద్రా నుండి టియువి500 ఎమ్‍పివి
ఇండియన్ మార్కెట్లో ఎస్‌యువి సెగ్మెంట్‌కి అత్యంత పేరుగాంచిన వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా. ఇప్పుడు ఇది దేశీయ మార్కెట్లో ఉన్న ఎమ్‌పివి సెగ్మెంట్లోకి కూడా ప్రవేశిస్తోంది. టియువి500 అనే పేరుతో అతి త్వరలో దేశీయ ఎమ్‌పివి విభాగంలో అడుగిడనుంది.
మహీంద్రా టియువి500 ఎమ్‌పివి గురించి పూర్తి వివరాలు...

టయోటా మోటార్స్ తాజాగా ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివి వాహనం మంచి విజయం సాధించిన నేపథ్యంలో మహీంద్రా అండ్ మహీంద్రా వారు ఎస్‌యువి విభాగంతో పాటు ఎమ్‌పివి విభాగంలోకి తమ ఉత్పత్తులను విడుదల చేయాలని భావించింది. అందులో భాగంగానే టియువి500 ను ఎమ్‌పివి రూపంలో అందిస్తోంది.

మహీంద్రా వారు తమ టియువి500 ఎమ్‌పివికు అత్యంత భద్రత మరియు రహస్యంగా రహదారి పరీక్షలు నిర్విహించారు.

ముందు వైపు డిజైన్‌ను గమనించినట్లయితే పొడవైన స్లాట్లను కలిగి ఉండే ఫ్రంట్ గ్రిల్‌ను గుర్తించవచ్చు. అంతే కాకుండా ముందువైపున ఉన్న అద్దం ఎంతో పొడవుగా ఉంటుంది. మహీంద్రా తమ జైలో నుండి గ్రహించినట్లుంది.

ఈ టియువి500 ఎమ్‌పివి లో మూడవ వరుస ఎంతో సౌకర్యవంతంగా రూపొందించారు. అందుకోసం క్యాబిన్‌ను పొడగించారు. కాని ఎక్స్‌యువీ500 లో మూడవ వరుస అంత సౌకర్యవంతంగా ఉండదు.

మహీంద్రా అండ్ మహీంద్రా ఈ టియువి500 వాహనంలో 2.2 లీటర్ డీజల్ ఇంజన్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇది సుమారుగా 140బిహెచ్‌పి పవర్ మరియు 330ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌తో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఢిల్లీ లో అధిక సామర్థ్యం ఉన్న డీజల్ వాహనాల బ్యాన్ నేపథ్యంలో మహీంద్రా 1.99 లీటర్ డీజల్ ఇంజన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఈ ఇంజన్ సుమారుగా 140బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

మహీంద్రా ఈ టియువి500 ను తొమ్మిది మంది కూర్చునే సీటింగ్ సామర్థ్యంతో రూపొందిస్తున్నారు.

ధర విషయానికి వస్తే మహీంద్రా టియువి500 వాహనం టయోటా ఇన్నోవా క్రిస్టా కన్నా తక్కువ ధరతో అందుబాటులోకి రానుంది.

మొత్తం మీద దీని అన్ని వైపుల డిజైన్‌ను గమనిస్తే ఎమ్‌పివి సెగ్మెంట్లో మహీంద్రా విజయాన్ని సొంతం చేసుకోనుందని చెప్పొచ్చు. కాని దీనికి సరికొత్త పేరును జోడిస్తే మరింత బాగుటుంది.


Click it and Unblock the Notifications








