శక్తివంతమైన ఎమ్‌హాక్ ఇంజన్ మరియు ఆటోమేటిక్ ఆప్షన్‌తో మహీంద్రా టియువి300
మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ గత ఏడాది ఇండియన్ మార్కెట్లోకి టియువి300 ఎస్‌యువిను విడుదల చేసింది. ఆశించిన స్థాయిలో అమ్మకాలను సాధించింది టియువి300. అయితే అమ్మకాలను మరింతగా పెంచుకునేందుకు ఈ టియువి300లో అత్యంత శక్తివంతమైన ఎమ్‌హాక్100 (mHAWK100) ఇంజన్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించింది.

మహీంద్రా అండ్ మహీంద్రా ఈ శక్తివంతమైన టియువి కాంపాక్ట్ ఎస్‌యువిలో 1.5-లీటర్ mHAWK100 ఇంజన్‌ను అందించి.

ఈ ఇంజన్ సుమారుగా 100 బిహెచ్‌పి పవర్ మరియు 240 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇందులోని ఇంజన్‌కు ఆప్షనల్‌గా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించారు.

దీని ధర సుమారుగా 8.87 లక్షలు ఎక్స్ షోరూమ్ (ముంబాయ్)గా ఉంది.

మహీంద్రా టియువి300 లో అత్యంత శక్తివంతమైన ఇంజన్‌ను అందివ్వడం వలన ఇది పనితీరు పరంగా డ్రైవింగ్ చేసే వారికి మంచి అనుభవాన్ని ఇస్తుంది.

దీనిని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసినప్పటి నుండి దేశీయంగా 25,000 లకు పైగా టియువి వాహనాలు అమ్ముడుపోయాయి.

తాజాగా ఇందులో సరికొత్త ఇంజన మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందివ్వడం వలన మరిన్ని అమ్మకాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

నార్త్ కొరియాను బయపెడుతున్న అమెరికన్ బోయింగ్ బి-52 బాంబర్


Click it and Unblock the Notifications








