స్వాతంత్ర సంబరాల స్పెషల్; సరికొత్త రంగులో మహీంద్రా టియువి300

By Anil

దేశీయంగా ఎస్‌యువి వాహనాల ప్రియులకు సరైన ఉత్పత్తులను అందిస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా, 70 వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను పురస్కరించుకుని తమ లేటెస్ట్ ఎస్‌యువి టియువి300 ను సరికొత్త బ్రాంజ్ గ్రీన్ కలర్‌లో అందించారు.

సరికొత్త బ్రాంజ్ గ్రీన్ కలర్‌లో మహీంద్రా టియువి300

మహీంద్రా సరికొత్త పెయింట్ స్కీమ్‌లో అందుబాటులోకి తెచ్చిన దీనిని స్పెషల్ ఎడిషన్‌గా విడుదల చేశారు. అయితే దీనికి సంభందించిన ధర వివరాలను వెల్లడించలేదు. కాని దేశ వ్యాప్తంగా ఉన్న మహీంద్రా డీలర్లను ఆయా ప్రాంతాల్లో ఉన్న వినియోగదారులు సంప్రదిస్తే దీనిని కోరుకునే వారు దక్కించుకోవచ్చు. ఏ విధమైన అదనపు ధరలు ఉండకపోవచ్చు అనేది డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ అభిప్రాయం.
Also Read: అప్ కమింగ్ మహీంద్రా కార్లు మరియు ఎస్‌యువిలు
ఎక్ట్సీరియర్ యొక్క పెయింటింగ్ మార్పులతో తప్పిస్తే ఏ విధమైన సాంకేతిక మార్పులు ఇందులో చోటు చేసుకోలేదు. ఈ టియువి300లో 1.5-లీటర్ ఎమ్‌హాక్ డీజల్ ఇంజన్ కలదు, ఇది సుమారుగా 80బిహెచ్‌పి పవర్ మరియు 230ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ అందుబాటులో ఉంది.
Also Read: స్కార్పియో నా మజాకా: రెట్టింపు పొడవుతో నయా స్కార్పియో
మహీంద్రా వారి ఉత్పత్తుల్లో బాగా ఆమోదం పొందిన ఉత్పత్తుల్లో టియువి ఒకటి . టియువి300 యొక్క ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 8.75 లక్షలుగా ఉంది. భవిష్యత్తులో మహీంద్రా మరిన్ని కొత్త వాహనాలను విడుదల చేసే ఆలోచనలో ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 17, 2016, 8:00 [IST]
English summary
TUV3OO Now Available In Bronze Green Colour — Independence Day Special
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+