వెరిటో వైబ్ ఉత్పత్తి నిలిపివేత: మహీంద్రా
దేశీయ దిగ్గజ విభిన్న వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తాము అందిస్తున్న అన్ని ఉత్పత్తుల పరంగా మంచి అమ్మకాలనే సాధిస్తోంది. అయితే హ్యాచ్‌బ్యాక్‌ల సెగ్మెంట్లోకి అందించిన వెరిటో వైబ్ మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోతోంది. తక్కువ అమ్మకాల కారణంగా కొన్ని రోజుల పాటు ఈ వెరిటో వైబ్ హ్యాచ్‌బ్యాక్‌ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు సంస్థ తెలిపింది.

ఎస్‌యువి మరియు వాణిజ్య వాహనాల అమ్మకాల్లో సింహ భాగంలో ఉన్న మహీంద్రా ఇప్పుడు తమ హ్యాచ్‌బ్యాక్ వెరిటో వైబ్ పరంగా ఏ మాత్రం అమ్మకాలు నమోదు కాలేదు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు మాసాల్లో కేవలం 32 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి మరియు గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తం మీద కేవలం 619 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

తక్కువ అమ్మకాలు సాధిస్తోంది అనే కారణంగా వీటి ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయాలని చూస్తోంది. ప్రస్తుతం డీలర్ల వద్ద ఉన్న స్టాకు పూర్తి అయ్యేంత వరకు వెరిటో వైబ్ లను ఉత్పత్తి చేయకూడదనే ఆలోచనలో ఉన్నారు.

అయితే భవిష్యత్తులో డిస్కౌంట్లు మరియు ఆఫర్ల ద్వారా వీటి అమ్మకాలను కొనసాగించాలా లేదా శాశ్వతంగా మార్కెట్ నుండి తొలగించాలా అనే సందేహంలోనే మహీంద్రా ప్రతినిధులు ఉన్నారు.

మహీంద్రా అండ్ మహీంద్రా ఈ వెరిటో వైబ్ హ్యాచ్‌బ్యాక్‌ను కేవలం దేశీయంగా మాత్రమే అందుబాటులో ఉంచారు . విదేశాల్లో వీటి జాడ అస్సలు లేదు. మహీంద్రా దీనిని 2013 లో విడుదల చేసింది.

మహీంద్రా వారి లైనప్‌లో ఉన్న చిన్న కార్ల సెగ్మెంట్లలో మనకు బాగా తెలిసిన ఉత్పత్తులు లోగాన్ మరియు వెరిటో. లోగాన్ లో రెనో సంస్థకు చెందిన 1.5-లీటర్ కె9కె డీజల్ ఇంజన్ అందించారు. ఇది సుమారుగా 64బిహెచ్‌పి పవర్ మరియు 160ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

వెరిటో వైబ్ ప్రారంభ ధర రూ. 6.39 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. వీటి టాప్ ఎండ్ వేరియంట్ ధరలు చాలా గరిష్టంగా ఉన్నాయి. బహుశా అధిక ధరలు కారణంగానే కావచ్చు ఇది మార్కెట్లో మంచి ఫలితాలను సాధించలేకపోతోంది.

మహీంద్రా వారి మరో ఉత్పత్తి వెరిటో సెడాన్. ఇది అమ్మకాల పరంగా మంచి ఫలితాలనే సాధిస్తోంది. వాణిజ్య విభాగం పరంగా దీనికి మంచి గిరాకీ లభిస్తోంది. గత ఏడాదిలో 2,776 యూనిట్లు అమ్ముడుపోయి సుమారుగా 52 శాతం వృద్దిని సాధించింది.

మహీంద్రా వెరిటో వైబ్ హ్యాచ్‌బ్యాక్ ఉత్పత్తి నిలిపివేత

- ఏ రిస్కు లేకుండా కారు భీమా చేసుకోండి.... పూర్తి వివరాలకు !!


Click it and Unblock the Notifications








