కొత్త ధరలతో మహీంద్రా ఎక్స్‌యువి500 మరియు 1.99-లీటర్ డీజల్ స్కార్పియో
మహీంద్రాతో పాటుగా చాలా వరకు ఇతర సంస్థలు తమ 2000సీసీ కన్నా ఎక్కువ కెపాసిటి గల వాహనాలను ఢిల్లీ మరియు ఎన్‍సిఆర్ రీజియన్‌లలో అమ్మకాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యకు గాను మహీంద్రా ప్రత్యేకంగా ఢిల్లీ వినియోగదారుల కోసం 1.99-లీటర్ కెపాసిటి గల ఇంజన్‌ను రూపొందించింది.
మహీంద్రా అండ్ మహీంద్రా ఈ కొత్త ఇంజన్‌ను ఎక్స్‌యూవీ500 మరియు స్కార్పియోలలో అందించనుంది. దీనికి సంభందించిన ధర మరియు ఇతర వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

మహీంద్రా ఢిల్లీ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఎక్స్‌యూవీ500 మరియు స్కార్పియో లలో 1.99-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

1.99-లీటర్ కెపాసిటి గల డీజల్ ఎక్స్‌యూవీ ధర రూ. 11.58 లక్షల నుండి 15.51 లక్షల మధ్య ఉండనుంది. అదే విధంగా స్కార్పియో ధర రూ. 6.67 లక్షల నుండి 12.75 లక్షల మధ్య ఉండనుంది. రెండు ధరలు కూడా ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉండనున్నాయి.

1.99-లీటర్ కెపాసిటి గల డీజల్ ఎక్స్‌యూవీ వాహనం దాదాపుగా 140 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

1.99-లీటర్ కెపాసిటి గల స్కార్పియో డీజల్ వాహనం దాదాపుగా 127 బిహెచ్‌పి పవర్ మరియు 280 ఎన్ఎమ్ గిరష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా వారు స్కార్పియో వాహనంలో 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను మరియు ఎక్స్‌యువీ500లో 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను అందించారు.

మహీంద్రా వారి ఇలా ఢిల్లీ ప్రజల కోసం ప్రత్యేకమైన డీజల్ ఇంజన్‌లో ఈ రెండు వాహనాలు అందివ్వడానికి కారణం, 2000సీసీ కెపాసిటి గల డీజల్ ఇంజన్ వాహనాల రిజిస్ట్రేషన్లను ఢిల్లీ పరిధిలో చేయకూడదని తీర్పు వెలువరించింది. ఇది మార్చి 31, 2016 అమలులో ఉండనుంది.

అయితే సుప్రీం కోర్టు దీనిని మీద విదించిన ఆంక్షలను మరింత కాలం పొడిగిస్తే దీనికి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా స్కార్పియో మరియు ఎక్స్‌యూవీ500 లను 2000సీసీ కన్నా తక్కువ ఇంజన్ ఆప్షన్లో అందివ్వడానికి సిద్దంగా ఉన్నట్లు మహీంద్రా తెలిపింది.

- 100,000 లు దాటిని మారుతి సుజుకి బాలెనొ బుకింగ్స్
- వేసవి కాలంలో రైడింగ్ కోసం 10 ముఖ్యమైన చిట్కాలు


Click it and Unblock the Notifications








