మహీంద్రా ఎక్స్‌యూవీ500 5వ వార్షికోత్సవం: భారీ ఆఫర్లు
మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ మార్కెట్లోకి తమ ఎక్స్‌యూవీ500 ని విడుదల చేసి ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించింది.
మహీంద్రాకు చెందిన ఫ్లాగ్ షిప్ ఎస్‌యువి ఎక్స్‌యూవీ500 దేశీయ ఎస్‌యువి మార్కెట్లోకి ప్రవేశించి ఈ ఏడాదితో ఐదు వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దీనిని ఎంచుకునే వినియోగదారులకు ప్రత్యేకమైన ఆఫర్లు మరియు డిస్కౌంట్లను భారీగా అందుబాటులో ఉంచింది.

ఎక్స్‌యూవీ500 వార్షికోత్సవం సరిగ్గా దీపావళికి ముందుగా రావడం మహీంద్రా అమ్మకాలు పెరగడానికి మంచి అవకాశం ఏర్పడింది.

మహీంద్రా డీలర్లు ఈ ఎక్స్‌యూవీ500 ను ఎంచుకునే వారికి 22,000 నుండి 66,000 రుపాయల వరకు లాభాలను ప్రకటించారు. మహీంద్రా ఎక్స్‌యూవీ500 ను ఎంచుకునేందుకు ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు.

ఈ ఎక్స్‌యూవీ500 ఉచిత రోడ్ అసిస్టెన్స్ ప్యాకేజి, పొడగించబడిన వారంటీ, ఇన్సూరెన్స్ మరియు అదనపు యాక్ససరీల మీద మరిన్ని లాభాలను ప్రకటిస్తున్నారు.

ఎక్స్‌యూవీ500 విడుదలయిన ఐదేళ్ల కాలంలో సుమారుగా 1.5 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి. సెప్టెంబర్ 2011లో మహీంద్రా ఈ ఎక్స్‌యూవీ500 ను విడుదల చేసింది.

మధ్య సైజు ఏడు మంది కూర్చునే సదుపాయంతో, విలాసవంతమైన ఇంటీరియర్ డిజైన్, చిరుత ప్రేరణతో దీని బాడీ డిజైన్ చేయడం జరిగింది. భారీ ఫీచర్లతో 18 లక్షలలోపు ధరతో విడుదలైన ఇది మంచి విజయాన్ని అందుకుంది.

మహీంద్రా ఈ ఎక్స్‌యూవీ500లో 2.2-లీటర్ సామర్థ్యం గల ఎమ్‌హాక్ టుర్బోచార్జ్‌డ్ డీజల్ ఇంజన్ మరియు 1.99-లీటర్ సామర్థ్యం డీజల్ ఇంజన్‌లను పరిచయం చేసింది.

ఎక్స్‌యూవీ500 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందించారు. ఇందులోని టాప్ ఎండ్ వేరియంట్లు అయిన డబ్ల్యూ8 మరియు డబ్ల్యూ10 మోడళ్లలో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కలదు.

- దెయ్యాలు తిరిగే ఈ రోడ్ల మీదకు వెళితే తిరిగి రావడం కష్టమే
- ఈ భారతీయ రోడ్ల మీద ప్రయాణం తాడు మీద నడిచే అనుభవానికి సమానం !


Click it and Unblock the Notifications








