కొత్త ఫీచర్లతో ఎక్స్‌యువీ500: అమ్మకాలే లక్ష్యంగా మహీంద్రా
దేశీయ ఎస్‌యువి సెగ్మెంట్లో తనదైన ముద్ర వేసుకున్న మహీంద్రా అండ్ మహీంద్రా విసృత స్థాయిలో విభిన్న ఎస్‌యువిలను ఇండియన్స్‌కు పరిచయం చేసింది. మహీంద్రా వారి ఎస్‌యువిల శ్రేణిలో ఉన్న ఎక్స్‌యువీ500 లో గత ఏడాదిన ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను పరిచయం చేసింది.
ఎస్‌యువి వాహనాలలో మరిన్ని నూతన ఫీచర్లను అందించి వినియోగదారులకు మరింత చేరువ కావడానికి తమ ఎక్స్‌యూవీ500లో నయా ఫీచర్లను అందించింది. మహీంద్రా ఎక్స్‌యువీలోని నూతన ఫీచర్ల కోసం క్రింది స్లైడర్ల మీద ఓ స్మార్ట్ లుక్కేసుకోండి.

మహీంద్రా అండ్ మహీంద్రా తమ ఎక్స్‌యువీ500 ఆటోమేటిక్ లోని టాప్ ఎండ్ వేరియంట్లో పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ అదే విధంగా కీ లెస్ ఎంట్రీని పరిచయం చేసారు.

టాప్ ఎండ్ ఆటోమేటిక్ వేరియంట్ డబ్ల్యూ10 లో ముందు వైపున్న డోర్ హ్యాండిల్స్ మీద రిక్వెస్ట్ బటన్‌లను అందించారు.

ఎక్స్‌యువీ500 ఆటోమేటిక్ టాప్ ఎండ్ వేరియంట్లో ఫ్లిప్ అవుట్ కీ ఫీచర్ స్థానంలో స్మార్ట్ కీ ని భర్తీ చేశారు.

ఈ ఫీచర్లతో పాటు ఎక్స్‌యువీ500 ఆటోమేటిక్ టాప్ ఎండ్ వేరియంట్ డబ్ల్యూ10 లో ఆరు ఎయిర్ బ్యాగులు, హిల్ డిసెంట్ మరియు హిల్ హోల్డ్, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎలక్ట్రానిక్ సన్ రూఫ్ మరియు ఏడు అంగుళా తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ కలదు.

సాంకేతిక వివరాలు పరంగా ఈ ఎక్స్‌యువీ500 లో 2.2-లీటర్ ఎమ్‌హాక్ డీజల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 138బిహెచ్‌పి పవర్ మరియు 330ఎన్ఎన్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఇందులోని ఇంజన్‌కు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

ఎక్స్‌యువీ500 ఇప్పుడు ఫ్రంట్ వీల్ డ్రైవ్ మరియు ఆప్షనల్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌లతో కూడా లభ్యమవుతోంది.

ఢిల్లీ పరిధిలో 2000సీసీ కన్నా అధిక సామర్థ్యం ఉన్న డీజల్ వాహనాల అమ్మకాల నిషేధం ఉన్న కారణంగా మహీంద్రా ఢిల్లీ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా 1.9-లీటర్ ఎమ్‌హాక్ డీజల్ ఇంజన్‌ను ఎక్స్‌యువీ500లో అందుబాటులోకి తెచ్చింది.

మహీంద్రా తమ ఎక్స్‌యువీ500 ధరలను 12 నుండి 18 లక్షలు మధ్య ఉంచింది. అమ్మకాల్లో మంచి వృద్దిని సాధిస్తోన్న టయోటా ఇన్నోవా క్రిస్టాకు ఇది పోటీగా ఉంది.

ఈ సూపర్ సోనిక్ విమానంలో ముంబాయ్ నుండి న్యూయార్క్‌ను 4.5 గంటల్లో చేరుకోవచ్చు
జూన్ 2016లో దుమ్ములేపిన ఎస్‌యువి అమ్మకాలు


Click it and Unblock the Notifications








