మహీంద్రా నుండి ఐదు కొత్త ట్రాక్టర్లు: ప్రారంభ ధర రూ. 4.99 లక్షలు
మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ మార్కెట్లోకి ఐదు సరికొత్త యువో శ్రేణి ట్రాక్టర్లను విడుదల చేసింది. హైదరాబాద్‍లోని రామోజీ ఫిలిమ్ సిటి వేదికగా మహీంద్రా నువో శ్రేణికి చెందిన ట్రాక్టర్ల ప్రారంభ ధరలు 4.99 లక్షలు ఎక్స్‌షోరూమ్ హైదరాబాద్‌గా ఉన్నాయి.
యువో శ్రేణి ట్రాక్టర్ల గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

మహీంద్రా అండ్ మహీంద్రా వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడే ఐదు చిన్న తరహా ట్రాక్టర్లను రెండు తెలుగు రాష్ట్రాల్లోను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అంతే కాకుండా వీటిని దేశ వ్యాప్తంగా 15 ఇతర నగరాలలో అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు.

ప్రస్తుతం మహీంద్రా విడుదల చేసిన నువో శ్రేణి ట్రాక్టర్లు 30 నుండి 45 హార్స్ పవర్ మధ్య రేంజ్‌తో అందుబాటులో ఉన్నాయి.

యువో శ్రేణి ట్రాక్టర్లు 265 డిఐ, 275 డిఐ, 415 డిఐ, 475 డిఐ మరియు 575 డిఐ ఇవి వరుసగా 32, 35, 40, 42, 45 హార్స్‍పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

మహీంద్రా ఈ యువో ట్రాక్టర్లను దాదాపుగా 30 రకాల వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడే విధంగా వీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు.

ధరలు
మహీంద్రా విడుదల చేసిన ఈ ఐదు ట్రాక్టర్ల ధరలు 4.99 లక్షలు నుండి 6.49 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ హైదరాబాద్‌గా ఉన్నట్లు తెలిపారు.

ఇండియన్ మార్కెట్లోకి 3.20 లక్షల ధరతో టియాగో కారును విడుదల చేసిన టాటా మోటార్స్
ఇండియన్ ఇస్రో దాటికి బెంబేలెత్తుతున్న అమెరికన్ రాకెట్ లాంచింగ్ సంస్థలు


Click it and Unblock the Notifications








