చైనాలో అత్యంత చౌకైన కారుగా మళ్లీ పుట్టిన మారుతి 800

By Anil

భారత దేశంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న కారు మారుతి 800. దీనిని మొదటి కారుగా ఎంచుకున్న భారతీయులు కూడా అంతే స్థాయిలో ఉండేవారు. కాని ఈ మారుతి 800 కారు 2013 నుండి దేశీయ మార్కెట్లో అమ్మకాలను విరమించుకుంది. దీనిని దేశీయంగా సుమారుగా 27 లక్షల మంది ఎంచుకున్నారు. ఇప్పుడు సుజుకి ఈ మారుతి 800 ను చైనాలో అందుబాటులోకి తీసుకువచ్చారు. అంతే కాదు చైనాలో అత్యంత చౌకైన కారు కూడా ఇదే ఇప్పుడు దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో తెలుసుకుందాం రండి.

చైనాలో మళ్లీ పుట్టిన మారుతి 800

దేశీయంగా భారీ స్థాయిలో అమ్మకాలను సాధించి పూర్తిగా విశ్రాంతి తీసుకున్న ఈ మారుతి 800 మోడల్‌ను మారుతి సుజుకి చైనాలో జియాంగ్‌నాన్ టిటి అనే పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చింది.

చైనాలో మళ్లీ పుట్టిన మారుతి 800

చైనా మార్కెట్లో తిరిగి ఊపిరి పోసుకున్న ఈ జియాంగ్‌నాన్ టిటి కారు అత్యంత చౌకైన కారుగా నిలిచింది.

చైనాలో మళ్లీ పుట్టిన మారుతి 800

ఈ జియాంగ్‌నాన్ టిటి కారును జోటై ఆటోమొబైల్ యొక్క సబ్సిడరీతో జియాంగ్‌నాన్ ఆటో వారి సమక్షంలో అమ్మకాలు జరపనుంది.

చైనాలో మళ్లీ పుట్టిన మారుతి 800

చైనాలో జియాంగ్‌నాన్ టిటి పేరుతో విడుదలైన మారుతి 800 లో 800 సీసీ కెపాసిటి గల ఇంజన్ కలదు.

చైనాలో మళ్లీ పుట్టిన మారుతి 800

ఇందులోని 800 సీసీ ఇంజన్ సుమారుగా 36 బిహెచ్‍‌పి పవర్ మరియు 60 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

చైనాలో మళ్లీ పుట్టిన మారుతి 800

ఈ 800 సీసీ ఇంజన్‌కు 4-స్పీడ్ గేర్ బాక్స్‌ను అనుసంధానం చేశారు. తద్వారా ఇది లీటర్‌కు 19.23 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలదు.

చైనాలో మళ్లీ పుట్టిన మారుతి 800

జియాంగ్‌నాన్ టిటి కారును జియాంగ్‌నాన్ ఆటో సంస్థ తయారు చేయడానికి సుజుకి అనుమతులు మంజూరు చేసింది.

చైనాలో మళ్లీ పుట్టిన మారుతి 800

అంతే కాకుండా వీటిని తయారీ మరియు రిటైలింగ్‌ను జోటై ఆటోమొబైల్స్ సమక్షంలో జరగనున్నట్లు కూడా సుజుకి తెలిపింది.

చైనాలో మళ్లీ పుట్టిన మారుతి 800

డిజైన్ పరంగా మారుతి 800 ను చైనీయులు ఇష్టపడే విధంగా స్వల్ప మార్పులతో జియాంగ్‌నాన్ టిటి రూపంలో అందించారు. దీని ధర 15,800 యువాన్‌లుగా ఉండనుంది. అంటే లక్షా అరవై ఏడు వేల రుపాయలు మాత్రమే.

చైనాలో మళ్లీ పుట్టిన మారుతి 800

పూర్తిగా మారుతి 800 ఆధారంతో జియాంగ్‌నాన్ టిటి అనే పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ కారులో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. కేవలం చిన్న చిన్న మార్పులు మినహా, సన్ రూఫ్ పైన రూఫ్ రెయిల్స్ కలవు.

చైనాలో మళ్లీ పుట్టిన మారుతి 800

ముందు డిజైన్‌లో మార్పులు జరగనప్పటికీ వెనుక వైపున విండ్‌ షీల్డ్ స్పాయిలర్‌తో వచ్చింది.

చైనాలో మళ్లీ పుట్టిన మారుతి 800

జియాంగ్‌నాన్ టిటి లోని ఇంటీరియర్ వ్యూవ్

చైనాలో మళ్లీ పుట్టిన మారుతి 800

జియాంగ్‌నాన్ టిటి ఇంజన్

చైనాలో మళ్లీ పుట్టిన మారుతి 800

జియాంగ్‌నాన్ టిటి లోఎడమ వైపున ఉన్న స్టీరింగ్

చైనాలో మళ్లీ పుట్టిన మారుతి 800

జియాంగ్‌నాన్ టిటి లోని నియంత్రికలు మరియు మ్యూజిక్ సిస్టమ్

చైనాలో మళ్లీ పుట్టిన మారుతి 800

జియాంగ్‌నాన్ టిటి లోని స్పీడ్ మీటర్ మరియు డ్యాష్ బోర్డ్

ఆల్టో 800ను 30 లక్షల మంది ఎంచుకోవడానికి గల ముఖ్య కారణాలు

ఆల్టో 800ను 30 లక్షల మంది ఎంచుకోవడానికి గల ముఖ్య కారణాలు

Most Read Articles

English summary
Maruti 800 Rebirth In China; Named As Jiangnan TT
Story first published: Tuesday, May 24, 2016, 10:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X