మారుతి ఆల్టో 800 ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ విడుదల: ధర, ఫీచర్లు ఇతర వివరాల కోసం
దేశ వ్యాప్తంగా అత్యధికంగా కార్ల అమ్మకాలు సాధించే ఏకైక కారు మారుతి సుజుకి వారి ఆల్టో 800. మారుతి వీటి అమ్మకాలను రెట్టింపు చేయడానికి కోసం అన్నట్లుగా ఇండియన్ మార్కెట్లోకి ఆల్టో 800 ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. మునుపటి ఆల్టో కన్నా కొన్ని కొత్త మార్పులతో విడుదలైంది. కాని ధరలు నామమాత్రంగానే ఉన్నాయి. మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా....?

మారుతి ఆల్టో 800 ఫేస్‌లిఫ్ట్ ధరలు
- స్టాండర్డ్ ధర రూ. 2,49,000
- స్టాండర్డ్ (ఒ) ధర రూ. 2,55,000
- ఎల్‌ఎక్స్ ధర రూ. 2,83,000
- ఎల్‌ఎక్స్ (ఒ) ధర రూ. 2,89,000
- ఎల్‌ఎక్స్ఐ ధర రూ. 3,09,000
- ఎల్‌ఎక్స్ఐ (ఒ) ధర రూ. 3,15,000
- ఎల్‌ఎక్స్ఐ సిఎన్‌జి 3,70,000
- ఎల్‌ఎక్స్ఐ సిఎన్‌జి (ఒ) ధర రూ. 3,76,000
- విఎక్స్ఐ ధర రూ. 3,28,000
- విఎక్స్ఐ (ఒ) ధర రూ. 3,34,000 అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి .
- పెట్రోల్ - 24.9 కిలోమీటర్/లీటర్
- సిఎన్‌జి - 33.44 కిలోమీటర్/కేజి
- సుపీరియర్ వైట్
- సిల్కీ సిల్వర్
- గ్రానైట్ గ్రే
- బ్లేజింగ్ రెడ్ లతో పాటు ఇంకా రెండు కొత్త రంగులు
- మోజిటో గ్రీన్
- లెరూలియన్ బ్లూ వంటి రంగుల్లో అందుబాటులోకి వచ్చింది.
- అన్ని వేరయంట్లలో ఆప్షనల్‌గా డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్
- టాప్ ఎండ్ వేరియంట్లో వెనుక డోర్లకు చిల్డ్ లాక్స్
- ప్యాసింజర్ ఆవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్‌ను అన్ని వేరియంట్లలో తప్పనిసరి చేసారు.
- కీ లెస్ ఎంట్రీ


డిజైన్
మారుతి సుజుకి ఆల్టో 800 ఫేస్‌లిఫ్ట్ ముందు మరియు ఇంటీరియర్ డిజైన్ పరంగా ఓ మోస్తారు మార్పులతో వచ్చింది. ముందు వైపు పొడవైన ఫ్రంట్ గ్రిల్ కలదు, ఈ గ్రిల్‌కు మధ్య భాగంలో సుజుకి బ్యాడ్జ్ కలదు.

ఇంజన్
మారుతి ఆల్టో 800 ఫేస్‌లిఫ్ట్‌లో 799 సీసీ కెపాసిటి గల మూడు సిలిండర్ల ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 48 బిహెచ్‌పి పవర్ మరియు 69 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

ఈ ఆల్టో 800 ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ మరియు సిఎన్‌జి ఇంధన రకాలలో అందుబాటులో కలదు. ఈ రెండు వేరియంట్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉన్నాయి.

మైలేజ్

లభించు రంగులు
మారుతి సుజుకి ఆల్టో 800 ఫేస్‌లిఫ్ట్ ఆరు విభిన్న రంగుల్లో లభించును. అవి,

ఫీచర్లు
మారుతి సుజుకి ఈ ఆల్టో 800 ఫేస్‌లిఫ్ట్ లో ప్రయాణికుల భద్రత కోసం కొన్ని భద్రత పరమైన ఫీచర్లను అందించింది.

పోటీ
మారుతి సుజుకి ఆల్టో 800 ఫేస్‌లిఫ్ట్ రెనో వారి క్విడ్ మరియు త్వరలో విడుదల కానున్న డాట్సన్ వారి రెడి గో కార్లకు పోటీగా నిలవనుంది.

మారుతి ఆల్టో 800 ఫేస్‌లిఫ్ట్ ఫోటోలు

మారుతి ఆల్టో 800 ఫేస్‌లిఫ్ట్ ఫోటోలు

ఉత్తమ రీసేల్ వ్యాల్యూ కలిగిన సెకండ్ హ్యాండ్ కార్లు
పెట్రోల్, డీజల్ కార్ల కన్నా ఇవి ఎంతో నయం


Click it and Unblock the Notifications