100,000 లు దాటిని మారుతి సుజుకి బాలెనొ బుకింగ్స్
మారుతి సుజుకికు చెందిన బాలెనొ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కారు మార్కెట్లోకి విడుదల అయిన సమయం నుండి నేటి వరకు 100,00 బుకింగ్స్‌ను నమోదు చేసుకుంది. గత ఏడాది పండుగల సీజన్‌లో విడుదల అయిన ఇది కేవలం నాలుగు నెలలో సమయంలోనే ఈ విధమైన బుకింగ్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది.
బాలెనొ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

మారుతి సుజుకి కేవలం నాలుగు నెలల కాలంలోనే దేశీయంగా 100,00 వరకు బాలెనొ బుకింగ్స్‌ను నమోదు చేసుకుంది.

మారుతి సుజుకి వారి బాలెనొ మరియు హ్యుందాయ్ వారి ఐ20 గత డిసెంబర్ నెలలో ఢీ అంటే ఢీ అనే విధంగా పోటీపడ్డాయి. దీనిబట్టి చూస్తే బాలెనొ కారుకు ఐ20 ప్రత్యక్ష పోటిగా నిలిచింది అని చెప్పవచ్చు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న మారుతి సుజుకి బాలెనొ కారులో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్లో అందుబాటులో ఉంది.

దీని విజయం తరువాత మారుతి సుజుకి బాలెనొ పేరు మీద సరికొత్త బాలెనొ ఆర్ఎస్ కారును తీసుకురానుంది. అయితే ఈ ఆర్ఎస్ కారును గత నెలలో జరిగిన 2016 ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది.

ఈ బాలెనొ ఆర్ఎస్ కారులో 1.2-లీటర్ బూస్టర్ జెట్ ఇంజన్‌ను అందివ్వనున్నారు.

మారుతి సుజుకి ఈ బాలెనొ ఆర్ఎస్ కారును ఈ ఏడాది పండుగ సీజన్‌లో మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

- బాలెనొ దెబ్బకు కుదేలైన హ్యుందాయ్ వారి బెస్ట్ సెల్లింగ్ కారు
- టాప్-10 జాబితాలో రాజ్యమేలుతున్న మారుతి సుజుకి !


Click it and Unblock the Notifications