మూడు స్టార్ల భద్రత రేటింగ్‌తో అన్నింటికన్నా ముందున్న మారుతి బాలెనొ
మార్కెట్లోకి విడుదలైన ప్రతి కారుకు కూడా భద్రతా పరీక్షలు నిర్వహించాలి. అయితే వీటికి నిర్వహించే భద్రత మరియు క్రాష్ పరీక్షల్లో ఇవి ఎక్కడ నెగ్గకుండాపోతాయో అనే భయంతో చాలా వరకు సంస్థలు తమ కార్లకు భద్రత పరీక్షలు నిర్వహించవు.
మారుతి సుజుకి తమ బాలెనొ ద్వారా దేశీయంగా సంచలన విజయం సాధించిన విశయం విధితమే అయితే యూరో ఎన్‌సిఎపి వారు నిర్వహించిన క్రాష్ పరీక్షల్లో ఇది మూడు స్టార్ల రేటింగ్‌ను పొందింది. ఈ రేటింగ్‌తో ఇప్పుడు బాలెనొ అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

మారుతి సుజుకికు చెందిన బాలెనొ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కారుకు యూరో ఎన్‌సిఎపి వివిధ రకాల క్రాష్ పరీక్షలు నిర్వహించింది. ముఖ్యంగా ముందు మరియు ప్రక్కవైపుల దీనిని పరీక్షించింది.

2016 సంవత్సరంలో యూరో ఎన్‌సిఎపి క్రాష్ పరీక్షలను మరింత కఠనతరం చేసింది, ప్రస్తుతం తయారవుతున్న కార్లు ఎంత వరకు సురక్షితం అని వెల్లడిస్తున్నాయి. ఇందు కోసం యూరో నూతన సాంకేతికను వినియోగిస్తోంది.

మారుతి సుజుకి తమ ప్రీమియ్ హ్యాచ్‌బ్యాక్ బాలెనొలో ఉన్న స్టాండర్డ్ మరియు భద్రత ఫీచర్ల విషయంలో ఉన్న టాప్ ఎండ్ వేరియంట్లకు పరీక్షలు నిర్వహించారు.

స్టాండర్డ్ వేరియంట్‌కు నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో మూడు స్టార్లు మరియు భద్రత అంశాలలో ఉన్న టాప్ ఎండ్ వేరియంట్ నాలుగు స్టార్ల భద్రత రేటింగ్‌ను పొందాయి.

ప్రస్తుతం మారుతి సుజుకి తమ బాలెనొ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కార్లను ఇండియా నుండి యూరోపియన్ మార్కెట్‌కు ఎగుమతి చేస్తోంది.

యూరోపియన్ మార్కెట్‌కు ఎగుమతి అవుతున్న బాలెనొ కార్లలో రాడార్ బ్రేక్ అసిస్ట్ వ్యవస్థను అందించారు. అయితే ఈ ఫీచర్‌ను ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న కార్లలో లేదు.

క్రాష్ పరీక్షల్లో వినియోగించిన కారులో ముందు వైపున రెండు ఎయిర్ బ్యాగులు మరియు ప్రక్కవైపుల కర్టెన్ ఎయిర్ బ్యాగ్‌లను అందించారు. తద్వారా గరిష్టంగా భద్రతను కల్పించడానికి అవకాశం కలిగింది.

మిగతా అన్ని దేశాల్లో కూడా కార్లలో భద్రతకు సంభందించిన క్రాష్ పరీక్షలు మరియు భద్రత ఫీచర్లు ఉన్న కార్లకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. అయితే భారతీయుల దురదృష్టవశాత్తు ఇండియాలో ప్రాథమిక భద్రత ఫీచర్లను కూడా తప్పనిసరి చేయలేదు.

ఏదేమైనప్పటికీ మారుతి సుజుకి తమ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ బాలెనొ కారులో రెండు ఎయిర్ బ్యాగులు, సీట్ బెల్ట్ ప్రిటెన్సనర్ మరియు యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ముఖ్యమైన భద్రత ఫీచర్లను అందించింది.

క్రాష్ పరీక్షల్లో నెగ్గిన బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్: ఆశ్చర్యం...!!
మనం చెల్లించే సొమ్ముకు సరైన విలువ చేసే ఇండియన్ కార్లు


Click it and Unblock the Notifications








