మారుతి బాలెనో ఆటోమేటిక్ జెటా ట్రిమ్ వేరియంట్ మార్కెట్లోకి విడుదల
దేశీయ మొదటి అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి వరుసగా తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టి వరుస విజయాలను అందిపుచ్చుంకుంటోంది. అందులో ఒకటి మారుతి గత ఏడాది విడుదల చేసిన బాలెనో హాట్‌హ్యాచ్ బ్యాక్ కారు. అయితే మారుతి ఇప్పుడు ఈ బాలెనోను ఆటోమేటిక్ జెట్ ట్రిమ్ వేరియంట్లో మార్కెట్లోకి విడుదల చేసింది.
మారుతి బాలెనో ఆటోమేటిక్ జెటా ట్రిమ్ వేరియంట్ ధర మరియు ఇతర వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

మారుతి సుజుకి బాలెనో ఆటోమేటిక్ జెటా ట్రిమ్ వేరియంట్‌ను 7.47 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా అందుబాటులోకి తెచ్చారు.

ఇంతకు ముందు మారుతి తమ బాలెనోలోని డెల్టా వేరియంట్లో ఆప్షనల్‌గా సివిటి (కంటిన్యూయస్లీ వేరిబుల్ ట్రాన్స్‌మిషన్ ) అందించేది.

సిటివి గేర్‌బాక్స్‌ను కోరుకునే వారి కోసం ప్రత్యేకంగా ఈ అవకాశాన్ని కల్పించారు. అయితే దీని ధరను తక్కువగా ఉంచడం కోసం ఇందులో కొన్ని అదనపు ఫీచర్లను తొలగించివేశారు.

అయితే మారుతి సుుజుకి ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువచ్చిన ఆటోమేటిక్ వెర్షన్‌తో పాటు ఇతర ఫీచర్లు అయిన.....
- అల్లాయ్ వీల్స్
- ఆటో హెడ్ ల్యాంప్స్
- ఫాలో మి ల్యాంప్స్
- టెలిస్కోపిక్ స్టీరింగ్ కాలమ్
- కీ లెస్ ఎంట్రీ
- డ్రైవర్ సైడ్ అడ్జెస్టబుల్ సీట్
- ఆటోడిమ్మింగ్ రియర్ ప్యూవ్ మిర్రర్
- టిఎఫ్‌టి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

మరియు సౌకర్యానికి సంభందించి ఎన్నో ఫీచర్లను ఇందులో అందించింది.

ప్రస్తుతం బాలెనోకు సంభందించిన అన్ని వేరియంట్లు కూడా నెక్సా షోరూమ్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లోకి ఈ బాలెనో హ్యాచ్‌బ్యాక్ కారును పొందడానికి డిమాండ్ రిత్యా ఏడు నుండి ఎనిమిది నెలల వరకు వేచి చూడాల్సి ఉంటుంది. (వెయిటింగ్ పీరియడ్)

దేశీయంగా తయారవుతున్న బాలెనో హ్యాచ్‌బ్యాక్ అంతర్జాతీయ మార్కెట్లకు సైతం ఎగుమతి అవుతోంది.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న హోండా వారి జాజ్ మరియు హ్యుందాయ్ వారి ఎలైట్ ఐ20 సిరీస్ కార్లకు తీవ్ర పోటీగా నిలిచింది.

మారుతి సుజుకి మరియు ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమలో ఉన్న వివిధ రకాల తయారీ దారుల సమచారం గురించి ఎప్పుటికప్పుడు అప్‌డేట్స్ పొందుటకు డ్రైవ్‌స్పార్క్ తెలుగు
(telugu.drivespark.com)తో కలిసి ఉండండి.

భారతదేశపు మొదటి సెమి హై స్పీడ్ రైలు గతిమాన్ ఎక్స్‌ప్రెస్ గురించి ఆసక్తికరమైన విషయాలు
కొత్త రికార్డులు నెలకొల్పిన మారుతి వితారా బ్రిజా బుకింగ్స్
దేశీయ మార్కెట్లోకి మహీంద్రా వారి నువోస్పోర్ట్ విడుదల: మరిన్ని వివరాలకు


Click it and Unblock the Notifications