ఆటో ఎక్స్ పోలో ప్రదర్శితం కానున్న మారుతి సుజుకి బాలెనొ ఆర్ఎస్ కాన్సెప్ట్
మారుతి సుజుకి ఫిబ్రవరిలో జరిగే 2016 ఆటో ఎక్స్ పోలో బాలెనొ ఆర్ఎస్ కాన్సెప్ట్ కారును ప్రదర్శించనుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ కారు స్పోర్టివ్ లుక్ కోసం కొన్ని కొత్త ఎక్ట్సీరియర్ మార్పులతో రానుంది.

మారుతి సుజుకి బాలెనొ హ్యాచ్ బ్యాక్ ఫోటోలు:
మారుతి సుజుకి వారి బాలెనొ ఆర్ఎస్ హ్యాచ్‌బ్యాక్ కారులో టర్బోఛార్జర్ గల 1.0-లీటర్ బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్ తో రానుంది. అయితే ఇలాంటి ఇంజన్‌తో 2015 లో జరిగిన జెనీవా మోటార్ షోలో ఐకె-2 కాన్సెప్ట్ ను ప్రదర్శించారు. ఈ ఇంజన్ దాదాపుగా 110 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.
సాదారణ బాలెనొ హ్యాచ్‌బ్యాక్ తో పోల్చినపుడు ఇది స్పోర్టివ్ లుక్‌ను కలిగి ఉంటుంది. అందుకోసం మారుతి సుజుకి మోటార్స్ వారు దీనిని ఏరోడైనమిక్ డిజైన్‌తో రూపొందించారు. మరియు దీనికి వెనుకవైపున ఏరోడైనమిక్ స్పాయిలర్‌ను కల్పించారు.
మారుతి సుజుకి వారు ఈ బాలెనొ ఆర్ఎస్ కాన్సెప్ట్ కారును మార్కెట్లోకి తీసుకువస్తే, అబర్త్ పుంటో, హోండా జాజ్ మరియు వోక్స్‌వ్యాగన్ పోలో జిటి వంటి మోడళ్లకు పోటిగా నిలవనుంది. మారుతి సుజుకి వారు 2016 ఆటో ఎక్స్ పోలో బాలెనొ ఆర్ఎస్ కాన్సెప్ట్‌తో పాటు ఇగ్నిస్ మిని ఎస్‌యువి, వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువి ఇతర మోడళ్లను ప్రదర్శించనుంది.|


Click it and Unblock the Notifications




























