వితారా బ్రిజా విడుదల తేదీని ఖరారు చేసిన మారుతి సుజుకి
భారత దేశపు అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ వితారా బ్రిజా ఎస్‌యువిని మార్చి 21 న మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే మారుతి ఇంతకుముందే ఢిల్లీ ఆటో ఎక్స్ పోలో ఈ వితారా బ్రిజా వాహనాన్ని ప్రదర్శించింది.
మారుతి సుజుకి వితారా బ్రిజా ఎస్‌యువి కి చెందిన ఇంజన వివరాలు, లభించు వేరియంట్లు, ధర మరియు ఇతర వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

డిజైన్
వితారా బ్రిజా ముందు వైపు డిజైన్ అత్భుతంగా ఉంది. మారుతి సుజుకి తమ దగ్గర ఇప్పటికే ఉన్న డిజైన్లను రిపీట్ చేయకుండా సరికొత్త డిజైన్‌తో దీనిని రూపొందించారు. అయితే ఎస్‌యువిల మార్కెట్లో ఒక నూతన ఒరవడిని సృష్టించనుంది.

ధర వివరాలు
మారుతి సుజుకి తమ బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువిని మార్కెట్లోకి విడుదల చేస్తే దీని ధర దాదాపుగా రూ. 6.5 నుండి 8.5 లక్షల మధ్య ఉండనుంది.

ఇంజన్ వివరాలు
మారుతి సుజుకి ఇందులో 1.5-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

పవర్ మరియు టార్క్
ఇందులోని ఇంజన్ దాదాపుగా 90 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను విడుదల చేయును.

ట్రాన్స్‌మిషన్
వితారా బ్రిజాలోని డీజల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో రానుంది.

లభించు వేరియంట్లు
మారుతి సుజుకి వారి వితారా బ్రిజా ఎస్‌యువి లభించు వేరియంట్లు
- ఎల్‌డిఐ
- విడిఐ
- జడ్‌డిఐ
- జడ్‌డిఐ ప్లస్
- విడుదలప్పటి నుండి నేటి వరకు 30 లక్షలు అమ్ముడుపోయిన ఆల్టో కార్లు
- బుక్‌చేసి ఇంతకాలం అయినా ఇంకా డెలివరీ ఇవ్వలేదు, ఎందుకో తెలుసా

మేకిన్ ఇండియాలో భాగంగా
మారుతి సుజుకి దీనికి కావాల్సిన దాదాపుగా 98 శాతం విడి పరికరాలు దేశీయంగా మేకిన్ ఇండియాలో భాగంగా సమకూర్చుకోనుంది.

నెక్సా షోరూమ్ ద్వారా
మారుతి సుజుకి ప్రస్తుతం మార్కెట్లోకి తీసుకువస్తున్న నూతన మోడళ్లను కేవలం నెక్సా షోరూమ్ ద్వారా మాత్రమే అందుబాటులోకి తీసుకువస్తోంది.

ప్రస్తుతం నెక్సా షోరూమ్ ద్వారా ఎస్-క్రాస్ మరియు బాలెనొ కార్లను అందుబాటులో ఉంచారు. ఇపుడు వితారా బ్రిజా కారును కూడా ఇదే గూటికి చేర్చనుంది.

పోటి
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెనో డస్టర్, హ్యుందాయ్ క్రెటా మరియు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ వంటి ఎస్‌యువిలకు పోటిగా నిలవనుంది.



Click it and Unblock the Notifications








