ఎన్నడూ లేని విధంగా ఆఫర్లు ప్రకటించిన మారుతి సుజుకి
మారుతి సుజుకి మళ్లీ ఇండియన్స్‌కు ఆఫర్ల పండుగ తెచ్చింది. ప్రస్తుతం కొత్త కార్లను కొనుగోలు చేసే వారి బుకింగ్ అమౌంట్ మొత్తంలో 8 శాతం క్యాష్ బ్యాక్ రూపంలో వెనక్కి చెల్లించినున్నారు. అంటే ఒక కారు కోసం 25,000 రుపాయలను బుకింగ్ పేమెంట్‌గా చెల్లిస్తే అందులో 8 శాతం అంటే 2,000 రుపాయల వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

ప్రస్తుతం ఈ పద్దతిలో అందుబాటులో ఉంచిన క్యాష్ బ్యాక్ ఆఫర్ కేవలం కొన్ని ఎంచుకోదగ్గ మోడల్స్ మీద మాత్రమే ఉన్నాయి. అందులో సెలెరియో డీజల్, స్విఫ్ట్ డీజల్, స్విఫ్ట్ డిజైర్ డీజల్, ఆల్టో కె10 ఆటోమేటిక్, వ్యాగన్ఆర్ ఆటోమేటిక్, ఎర్టిగా పెట్రోల్ మరియు ఆల్టో 800 వంటి ఉత్పత్తల మీద ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
అదనంగా కొంత మంది లక్కీ కస్టమర్లకు 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తున్నారు. 25,000 రుపాయల క్యాష్‌బ్యాక్‌ను స్క్రాచ్ కార్డు ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ ఆఫర్‌కు అర్హత పొందాలంటే జూన్ 15 లోపు బుకింగ్ కాని లేదంటే జూన్ 30 లోపు డెలివరీ జరగాల్సి ఉంటుంది.
Also Read: ఇండియన్ మార్కెట్లోకి రానున్న మారుతి సుజుకి వారి ఎనిమిది కొత్త కార్లు
మారుతి సుజుకి వారి ఉత్పత్తుల మీద గరిష్టంగా ఉన్న డిస్కౌంట్లు
- ఆల్టో కె10 ఆటోమేటిక్ రూ. 59,100 లు
- సెలెరియో ఆటోమేటిక్ రూ. 59,100 లు
- ఆల్టో 800 (పాత మోడల్) రూ. 82,100 లు
- స్విఫ్ట్ (డీజల్) రూ. 62,000 లు
- స్విఫ్ట్ డిజైర్ (డీజల్) రూ. 52,100 లు
- ఎర్టిగా (పెట్రోల్) రూ. 50,100 లు
ఇక్కడ ఉన్న గరిష్ట ఆఫర్లు క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పోరేట్ డిస్కౌంట్ మరియు క్యాష్ డిస్కౌంట్‌లు అన్నింటి కలుపుకొని.


Click it and Unblock the Notifications