మారుతి సుజుకి సంస్థకు 20 ఎకరాలు కేటాయించిన ఏపి ప్రభుత్వం

By Anil

మారుతి సుజుకి డ్రైవింగ్ శిక్షణ మరియు ట్రాఫిక్ మీద పరిశోధన ఇన్‌స్ట్యూట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ప్రారంభించినుంది. దీనికి సంభందించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరియు మారుతి సుజుకి పరస్పర ఒప్పందం కుదురుకున్నాయి. దీనికి సంభందించి మారుతి సుజుకి డ్రైవింగ్ విభాగానికి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న మహేష్ రాజోరియా మరియు ఆంధ్ర ప్రదేశ్ రవాణా కమీషనర్ ఎన్. బాలసుబ్రమణ్యం ఈ ఒప్పందానికి సంభందించిన ఎమ్‌ఒయు పత్రాల మీద సంతకాలు చేసారు.

దీనికి సంభందించిన పూర్తి వివరాలు క్రింది కథనంలో....

మారుతి కోసం ఏపిలో 20 ఏకరాలు కేటాయింపు

మారుతి సుజుకి డ్రైవింగ్ శిక్షణ మరియు ట్రాఫిక్ మీద పరిశోధన ఇన్‌స్ట్యూట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలోని దర్శిలో ఉన్న వెంకటాచలం గ్రామంలో స్థాపించనున్నారు.

మారుతి కోసం ఏపిలో 20 ఏకరాలు కేటాయింపు

మారుతి సుజుకి దీని గురించి అందించన సమాచారం ప్రకారం, యువతకు నాణ్యమైన డ్రైవింగ్ శిక్షణ మరియు ట్రాఫిక్ నియమాల పట్ల సరైన అవగాహన కల్పించనున్నాము. దీనికి సంభందించి మారుతి సుజుకి దీని కోసం సుమారుగా ఒక దశాబ్దం నుండి పనిచేస్తోంది. ఈ నూతన ఇన్‌స్ట్యూట్ ద్వారా రహదారి భద్రతల గురించి వీలైనంత వరకు ఎక్కువ మందికి తరగతులు ఇప్పించి రహదారి భద్రత యొక్క ప్రాముఖ్యతను ప్రజలలోకి తీసుకెళతామని మారుతి సుజుకి తెలిపింది.

మారుతి కోసం ఏపిలో 20 ఏకరాలు కేటాయింపు

మారుతి సుజుకి ఈ ఇన్‌స్ట్యూట్‌ను ప్రారంభించడం కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 20 ఎకరాల భూమిని కేటాయించింది.

మారుతి కోసం ఏపిలో 20 ఏకరాలు కేటాయింపు

కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వారి నియమాల ప్రకారం ట్రైనింగ్ సెంటర్‌ యొక్క భవనం, వసతి గృహం మరియు డ్రైవింగ్ ట్రైనింగ్ ట్రాక్‌లను నిర్మించనున్నారు.

మారుతి కోసం ఏపిలో 20 ఏకరాలు కేటాయింపు

మారుతి సుజుకి వారి డ్రైవింగ్ శిక్షణ మరియు ట్రాఫిక్ మీద పరిశోధన ఇన్‌స్ట్యూట్‌ను పూర్తి స్థాయిలో నిర్మించి 2018 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు.

మారుతి కోసం ఏపిలో 20 ఏకరాలు కేటాయింపు

ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రభుత్వ మరియు ప్రయివేట్ భాగస్వామ్యం క్రింద అందుబాటులోకి తీసుకురానున్నారు.

మారుతి కోసం ఏపిలో 20 ఏకరాలు కేటాయింపు

దక్షిణ భారత దేశంలో మారుతి సుజుకి వారి ఇది మొదటి శిక్షణ కేంద్రం మరియు గుజరాత్‌లోని వడోదరలో ఉన్న ఇలాంటి సెంటర్‌తోనే కలసి పనిచేయనుంది. వీటి ద్వారా గ్రామీణ యువతకు డ్రైవింగ్ మరియు రహదారి భద్రత మీద శిక్షణ ఇచ్చి అదే విధంగా ఉపాధిని కల్పించనున్నారు.

మారుతి కోసం ఏపిలో 20 ఏకరాలు కేటాయింపు

రహదారుల భద్రతకు సంభందించి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సహాయం అందివ్వనుంది. దీని ముఖ్య ఉద్దేశం గ్రామీణ యువతకు డ్వైవింగ్ మీద శిక్షణతో పాటు వ్యక్తిత్వం, ప్రవర్తన మరియు సంభాషణల పట్ల కూడా శిక్షణ ఇవ్వనున్నారు.

మారుతి కోసం ఏపిలో 20 ఏకరాలు కేటాయింపు

పాంబన్ రైలు వంతెన గురించి మీకు తెలియని ఆసక్తికరమైన నిజాలు....

Article Published On: Friday, July 1, 2016, 18:05 [IST]
English summary
Ap Govt Maruti Suzuki Sets Up Institute Of Driving Training And Traffic Research
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+