కొత్త మైలు రాయిని ఛేదించిన మారుతి ఎర్టిగా
మారుతి సుజుకి దేశీయ ఎమ్‌పివి సెగ్మెంట్లోకి 2012లో ఎర్టిగాను విడుదల చేసింది. అప్పట్లో టయోటా ఇన్నోవాకు గట్టి పోటీనిచ్చి ఎమ్‌పివి సెగ్మెంట్లో లీటడర్‌గా నిలబజడతుందని అందరూ భావించారు. అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఇండియన్ ఎమ్‌పివి సెగ్మెంట్లో టయోటా ఇన్నోవా సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. అయితే సుదీర్ఘ సమయం అనంతరం ఎర్టిగా ఒక కొత్త మైలు రాయిని చేధించింది.

భారత దేశపు నెం. 1 కార్ల తయారీ సంస్థ సరిగ్గా నాలుగేళ్ల క్రితం 5 నుండి 10 లక్షల ధరల శ్రేణిలో ఎర్టిగాతో ఎమ్‌పివి సెగ్మెంట్లో గేమ్ ప్లాన్ చేసింది.

దేశీయ మార్కెట్లోకి ఇప్పటి వరకు సుమారుగా 2.75 లక్షల యూనిట్ల ఎర్టిగా వాహనాలు అమ్మకాలు జరిపి రికార్డు సృష్టించింది.

ప్రస్తుతం మారుతి ఎర్టిగా మరియు టయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివిలు మాత్రమే మంచి అమ్మకాలు సాధిస్తున్నాయి.

మారుతి ఎర్టిగా పెట్రోల్, డీజల్ మరియు మిల్డ్ హైబ్రిడ్ డీజల్ వర్షన్‌లలో ఆప్షనల్‌గా అందుబాటులో ఉన్నాయి.

ఇక ఇందులో ఉన్న స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ ఫ్రమ్ సుజుకి (ఎస్‌హెచ్‌విఎస్) సాంకేతికత ద్వారా ప్రభుత్వం లభించే రాయితీలను పొందవచ్చు.

ప్రస్తుతం దేశీయంగా ఎస్‌యువిల అమ్మాకాలు జోరందకుంటున్న నేపథ్యంలో మిగతా సెగ్మెంట్లలోని ఉత్పత్తుల అమ్మకాలు తగ్గినప్పటికీ ఎర్టిగా నిలకడగా ఉత్పత్తులను సాధిస్తోంది.

- వరల్డ్ వైడ్ టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్లు:ఐదు ఇండియావే


Click it and Unblock the Notifications








