ఇగ్నిస్ వేరియంట్లు, ట్రాన్స్‌మిషన్‌తో పాటు బుకింగ్స్ మరియు విడుదలను కూడా ఖాయం చేసిన మారుతి
మారుతి సుజుకి ఇగ్నిస్ విడుదల, బుకింగ్స్ మరియు వేరియంట్లకు సంభందించిన పూర్తి వివరాలు...
మారుతి సుజుకి ఇగ్నిస్ క్రాసోవర్ ఎస్‌యువి గురించి ఇండియన్ ఆటో న్యూస్ వెబ్‌సైట్లు, ఆటో పరిశ్రమ వర్గాలు మరియు సోషల్ మీడియా సైట్లు అన్నీ విభిన్నమైన కథనాలను ప్రచురిస్తున్నాయి. నేటి ఆటో పరిశ్రమలో అత్యంత హాట్ టాపిక్ ఇగ్నిస్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ ఇగ్నిస్ క్రాసోవర్‌కు సంభందించిన విడుదల, బుకింగ్స్ లతో పాటు ఇది విడుదలయ్యే ఇంజన్ వేరియంట్లు మరియు ట్రాన్స్‌మిషన్ వివరాలు ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీని గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం రండి.

మారుతి సుజుకి ఈ ఏడాది ప్రారంభంలో దేశీయంగా జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఈ ఇగ్నిస్ క్రాసోవర్ ఎస్‌యువిని ప్రదర్శించింది. మారుతి దీనిని వచ్చే జనవరిలో దేశీయంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

మారుతి ఈ ఇగ్నిస్ క్రాసోవర్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకు వస్తే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మహీంద్రా వారి కెయువి100 వాహనానికి గట్టి పోటీనివ్వనుంది. మారుతి లైనప్‌లోని వితారా బ్రిజాకు క్రింద స్థానాన్ని భర్తీ చేయనుంది.

మారుతి సుజుకి ఈ ఇగ్నిస్ క్రాసోవర్ ఎస్‌యువిని కేవలం నెక్సా వేదిక అందుబాటులోకి తీసుకురానుంది. దేశీయంగా విడుదల కానున్న ఇగ్నిస్ ప్రస్తుతం జపాన్ మార్కెట్లో అమ్మకాల్లో ఉంది.

కొలతల పరంగా ఈ ఇగ్నిస్ క్రాసోవర్ పొడవు 3,700ఎమ్ఎమ్, వెడల్పు 1,660ఎమ్ఎమ్, ఎత్తు 1,595 ఎమ్ఎమ్ లతో పాటు 2,435ఎమ్ఎమ్ వీల్ బేస్ మరియు 180ఎమ్ఎమ్ గరిష్ట గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది.

దేశీయంగా విడుదల కానున్న ఇగ్నిస్ నందు నల్లబడి ఏ మరియు బి పిల్లర్లు, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ లతో పాటు అత్యాధునిక డిజైన్ ఆర్చ్‌లతో ఉన్న 18 అంగుళాల పది స్పోక్స్ అల్లాయ్ వీల్స్ కలవు.

సరికొత్త ఇగ్నిస్ లో ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలుసా ? మనం కోరుకున్న తీరులో కస్టమైజేషన్ చేయించుకునే విధానం. మీరు చదివింది నిజమే, మారుతి ప్రవేశపెట్టిన మారుతి ఐ్రక్రియేట్ అప్లికేషన్ ద్వారా క్రాసోవర్ ఎస్‌యువిని మీకు నచ్చిన తీరులో కస్టమైజేషన్ చేసుకోవచ్చు. తరువాత అచ్చం అలాంటి ఇగ్నిస్‌ను పొందచ్చు.

దేశీయ విపణిలోకి ప్రవేశించే మోడళ్లలో పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంధన ఆప్షన్‌లు ఉండనున్నాయి. ఇవి 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న కె12బి పెట్రోల్ మరియు 1.3-లీటర్ డిడిఐస్ విటివిటి డీజల్ ఇంజన్‌లతో వచ్చే అవకాశాలున్నాయి.

ట్రాన్స్‌మిషన్ పరంగా రెండు ఇంధన వేరియంట్లకు 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానంతో వచ్చే అవకాశం ఉంది.

మారుతి సుజుకి ఈ ఇగ్నిస్ క్రాసోవర్ ఎస్‌యువి జనవరి 13, 2017 న మార్కెట్లోకి విడుదల చేయనుంది మరియు దీని ప్రారంభ వేరియంట్ 4.5 లక్షల రుపాయల ఎక్స్ షోరూమ్ ధరతో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

- మారుతి నుండి శక్తివంతమైన హ్యాచ్ బ్యాక్
- మనోరంజనకరమైన మారుతి స్విఫ్ట్ న్యూ జనరేషన్
- ఆరు లక్షలకే 27 లక్షల కారు: ఇదెలా సాధ్యం ?


Click it and Unblock the Notifications