నెక్సా షోరూమ్ ద్వారా మారుతి విడుదల చేయనున్న మూడు కొత్త కార్లివే..

Written By:

మారుతి సుజుకి ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద వచ్చే ఏడాది విడుదల చేయనున్న కొత్త కార్లను ప్రదర్శించింది. అందులో 2017 వేదికగా బాలెనొ ఆర్ఎస్ మరియు ఇగ్నిస్‌లను మరియు నూతన అప్‌డేట్స్‌తో వస్తోన్న సియాజ్ హైబ్రిడ్ సెడాన్‌లను విడుదల చేయడానికి సిద్దమవుతోంది. అయితే ఈ మూడు ప్రీమియమ్ ఉత్పత్తులను తమ ప్రీమియమ్ షోరూమ్ నెక్సా ద్వారా మాత్రమే అందుబాటులోకి తీసుకురావడానికి మారుతి సన్నాహాలు చేస్తోంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
మారుతి సుజుకి నెక్సా షోరూమ్

మారుతి సుజుకి సాధారణ డీలర్ల వద్ద సియాజ్ సెడాన్ మంచి అమ్మకాలు సాధిస్తోంది. అయితే దీనికి ఇదే సెగ్మెంట్లో ఉన్న ఇతర ఉత్పత్తుల ద్వారా తీవ్ర పోటీ ఎదురవుతోంది. దీని పోటీదారులను ఎదుర్కునేందుకు మారుతి ఈ సియాజ్ ను ఫేస్‌లిఫ్ట్ రూపంలో ప్రీమియమ్ సెడాన్‌గా నెక్సా షోరూమ్ నుండి విడుదల చేయనుంది.

మారుతి సుజుకి నెక్సా షోరూమ్

మారుతి ఇప్పుడు సాదారణ మరియు ప్రీమియ్ ఉత్పత్తుల మీద ఆధిపత్య పోరుకు సిద్దమవుతోంది. అందు కోసం సాధారమ షోరూమ్‌ల ద్వారా పాపులర్ ఉత్పత్తులను మరియు నెక్సా షోరూమ్ ద్వారా ప్రీమియమ్ ఉత్పత్తులను అందిచడానికి ప్లాన్ చేస్తోంది.

మారుతి సుజుకి నెక్సా షోరూమ్

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న నెక్సా అవుట్‌లెట్ల ద్వారా బాలెనొ మరియు ఎస్-క్రాస్ క్రాసోవర్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. వీటి సరసన వచ్చే ఏడాదికి బాలెనొ ఆర్ఎస్, ఇగ్నిస్ మిని ఎస్‌యువి మరియు ఫేస్‌లిఫ్టెడ్ సియాజ్ సెడాన్‌ లను చేర్చనుంది. తద్వారా నెక్సా లోని ఉత్పత్తుల సంఖ్య ఐదుకు చేరనుంది.

మారుతి సుజుకి నెక్సా షోరూమ్

మారుతి సుజుకి తమ ప్రీమియమ్ షోరూమ్ నెక్సా నుండి అందుబాటులో ఉంచే ఉత్పత్తులకు సాధారణ భద్రత ఫీచర్లను తప్పనిసరి చేస్తోంది. అందుకోసం త్వరలో విడుదల కానున్న ఈ మూడు ఉత్పత్తులు కూడా డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు యాంట్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌లను స్టాండర్డ్‌గా అందిస్తోంది.

మారుతి సుజుకి నెక్సా షోరూమ్

వచ్చే ఏడాది స్పోర్ట్స్ తరహా ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్‌ని సృష్టించే అవకాశం ఉందేమో కాబోలు, మారుతి తమ బాలెనో ఆర్ఎస్ ను స్పోర్టీయర్ వెర్షన్‌లో తీర్చిదిద్దింది. బాడీ కిట్స్ మరియు స్పోర్టివ్‌గా ఉండే బాడీ కలర్ థీమ్స్ అందించింది.

మారుతి సుజుకి నెక్సా షోరూమ్

సాంకేతికంగా మారుతి ఈ బాలెనో ఆర్ఎస్ లో 1.0-లీటర్ సామర్థ్యం గల బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్‌ను పరిచయం చేయనుంది. మైలేజ్‌కు ప్రాముఖ్యతనిచ్చి రూపొందించిన ఈ ఇంజన్ గరిష్టంగా 109బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

మారుతి సుజుకి నెక్సా షోరూమ్

మారుతి విడుదల చేయనున్న మరో ప్రొడక్ట్ ఇగ్నిస్, ఇప్పటికే దీనికి మిని ఎస్‌యువి అనే పేరు వచ్చింది. దీని కొలతల పరంగా చూస్తే ఇది హ్యాచ్‌బ్యాక్. ఈ ఇగ్నిస్‌లో గరిష్ట గ్రౌండ్ క్లియరెన్స్, ప్లాస్టిక్ బాడీ క్లాడింగ్ మరియు మృదువైన ఆఫ్ రోడింగ్ సామర్థ్యం గల లక్షణాలు ఇందులో ఉన్నాయి.

మారుతి సుజుకి నెక్సా షోరూమ్

రిపోర్ట్స్ ప్రకారం మారుతి సుజుకి ఇగ్నిస్ 1-లీటర్ సామర్థ్యం ఉన్న బూస్టర్ జెట్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. మొదటి ఈ ఇగ్నిస్ కేవలం పెట్రోల్ ఆప్షన్‌లో మాత్రమే పరిచయం కానుంది.

మారుతి సుజుకి నెక్సా షోరూమ్

ప్రస్తుతం అప్‌డేటెడ్ వెర్షన్‌లో రానున్న సియాజ్ డిజైన్ పరంగా స్వల్ప మార్పులకు గురవుతోంది. అయితే సాంకేతికంగా ఏ విధమైన మార్పులు చోటు చేసుకోవడం లేదు. స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ బై సుజుకి ఆప్షన్‌తో పాటు అవే పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో రానుంది.

 
English summary
Maruti To Launch Three Vehicles Through NEXA In 2017
Story first published: Tuesday, December 6, 2016, 14:49 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark