సియాజ్ ఆటోమేటిక్‌ను విడుదల చేసిన మారుతి సుజుకి
మారుతి సుజుకి ప్రారంభ వేరియంట్ నుండి టాప్ ఎండ్ వేరియంట్ వరకు అన్ని కార్లలో కూడా ఆటోమేటిక్ వెర్షన్‌ను తీసుకురావాలని డిసైడ్ అయిపోయింది. అందుకోసం కాబోలు నేడు తమ సియాజ్ కారును ఆటోమేటిక్ వేరియంట్లో మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. మారుతి సుజుకి తమ సియాజ్ జడ్‌ఎక్స్‌ఐ+ కారు ధర రూ. 10.19 లక్షలు ఎక్స్ షోరూమ్, (ఢిల్లీ) ప్రకటించింది.
మారుతి సుజుకి సియాజ్ ఆటోమేటిక్ కారు వెర్షను గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా వివరంగా ఇవ్వడం జరిగింది.

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్
మారుతి సుజుకి తమ విఎక్స్ ఐ మరియు జడ్‌ఎక్స్ ఐ వేరియంట్లలో గల 4-స్పీడ్ గేర్ బాక్స్ గల ఇంజన్‌కు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందించారు.

ఇంజన్ వివరాలు
మారుతి సుజుకి కొత్తగా ట్రాన్స్‌మిషన్ మార్పులతో తీసుకువచ్చిన సియాజ్ కారులో ఎటువంటి ఇంజన్ మార్పులు చోటుచేసుకోలేదు. అయితే ఇంతకు ముందు అందించన 1.4-లీటర్ నాలుగు సిలిండర్ల ఇంజన్‌ను కల్పించారు.

పవర్
ఇందులోని అత్యంత శక్తివంతమైన ఇంజన్ దాదాపుగా 91 బిహెచ్‌పి పవర్ మరియు 130 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయును.

పొడవైన వీల్ బేస్
సియాజ్ తన పోటి దారులతో పోల్చుకుంటే విశాలమైన క్యాబిన్ మరియు లాంగ్ వీల్ బేస్‌ను కలిగి ఉంది.

మారుతి సుజుకి వారు మునుపటి సియాజ్ కారులో అందివ్వలేకపోయిన అన్ని ఫీచర్లను ఈ సరికొత్త ఆటోమేటిక్ జడ్‌ఎక్స్‌ఐ కారులో అందించినట్లు తెలిపారు.

పోటీదారులు
మారుతి సుజుకి వారి సియాజ్ ఆటోమేటిక్ కారుకు గల గట్టి పోటీదారులు హోండా సిటి, స్కోడా ర్యాపిడ్, వోక్స్‌వ్యాగన్ అమియో మరియు హ్యుందాయ్ వారి వెర్నా

మిడ్ సైజ్ సెడాన్ కార్లకు పోటి
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మిడ్ సైజ్ సెడాన్ కార్లలో హోండా సిటి తిరుగులేని విజయాన్ని సాధిస్తోంది. అయితే మిడ్ సైజ్ సెడాన్‌ల మార్కెట్లో కూడా మారుతి సుజుకి తమ సియాజ్ ఆటోమేటిక్ ద్వారా జెండా పాతాలను చూస్తోంది.

మారుతి సుజుకి సియాజ్ సెడాన్ కారును అందిస్తున్న వివిద రకాల వేరియంట్లు
- విఎక్స్ఐ
- విఎక్స్ఐ(ఓ)
- విఎక్స్ఐ ప్లస్
- జడ్‌ఎక్స్ఐ
- విఎక్స్ఐ ప్లస్ ఎటి
- జడ్‌ఎక్స్‌ఐ ప్లస్
- జడ్ఎక్స్ఐ ప్లస్ ఎటి
- విడిఐ ఎస్‌హెచ్‌విఎస్
- విడిఐ(ఓ)
- విడిఐ ప్లస్ ఎస్‌హెచ్‌విఎస్
- జడ్‌డిఐ ఎస్‌హెచ్‌విఎస్
- జడ్‌డిఐ ప్లస్ ఎస్‌హెచ్‌విఎస్ ఆర్ఎస్
- విశాలమైన ఫీచర్లు
- వెనుక వైపుకు వీచే ఎ/సి
- విండ్ స్క్రీన్ మీద అదనపు షేడ్
- రీడింగ్ ల్యాంప్స్
- లెథర్ సీట్లు
- అన్నింటింకన్నా ఆద్యంతం లగ్జరీ ఫీలింగ్‌ను తలపించే ఇంటీరియర్
- 170 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియన్ రైల్వే గురించి ఆసక్తికరమైన విషయాలు
- బొగ్గు గనులలో బయల్పడిన రహస్యమైన కార్లు అవశేషాలు


ఫీచర్లు



Click it and Unblock the Notifications








