మారుతి నుండి మరిన్ని హైబ్రిడ్ కార్లు
"చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం" అనే నానుడి వినే ఉంటారు కదా ? దీనిని మీకు గుర్తుచేయడానికి ఒక సందర్బం వచ్చింది. ఈ కథనం పూర్తిగా చూద్దాం మీకే అర్థం అవుతుంది.
చాలా వరకు ఆర్గనైజేషన్లు, ఎన్‌జివోలు మరియు ఇతరులు పర్యావరణ పరిరక్షణ, కాలుష్యాలను తగ్గించి పర్యావరణ పరిరక్షణలో తలమునకలవుతుంటారు. కాని కొంత మంది వలన కాలుష్యం రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ ధోరణి మారడానికి మారుతి తమ వంతుగా హైబ్రిడ్ వాహనాలను అభివృద్దిచేసి కాలుష్యాన్ని తగ్గించేప్రణాళికల వేస్తోంది. ఇప్పడు మొదట చెప్పిన నానుడి గుర్తుకుతెచ్చుకోండి. కావాల్సినన్ని డీజల్ పెట్రోల్ వాహనాలను విడుదల చేసి ఇప్పుడు హైబ్రిడ్ వాహనాలు అంటున్నాయి వాహన తయారీ సంస్థలు.

ఏదేమైనప్పటికీ హైబ్రిడ్ వాహనాల ద్వారా కాలుష్యం అదుపులోకి వస్తుంది అనేది చాలా వరకు వాస్తవం. హైబ్రిడ్ వాహనాలు అనగా ఇంటర్నల్ కంబషన్+ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం గల వాహనాలను హైబ్రిడ్ వాహనాలు అంటారు.
Also Read: మారుతి కొత్త రికార్డుకి ఈ రెండు ఎంతో కీలకం
ఇప్పుడు మారుతి సుజుకి తమ శ్రేణిలో ఉన్న ఉత్పత్తుల్లో వ్యాగన్ఆర్, ఆల్టో మరియు ఎకో కార్లలో సిఎన్‌జి పరిజ్ఞానాన్ని అందిస్తోంది. అదే విధంగా ఎర్టిగా ఎమ్‌పివి మరియు ప్రీమియమ్ సెడాన్ సియాజ్‌లలో మిల్డ్ హైబ్రిడ్ సాంకేతికతను అందిస్తోంది.
Also Read: ఇండియన్ మార్కెట్లోకి రానున్న మారుతి సుజుకి వారి 8 కార్లు
సుజుకి సంస్థ 2015-16 వార్షికోత్సవం వేడుకల్లో సంస్థ సిఇవో మరియు మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి అయుకవా షేర్ హోల్డర్లతో మాట్లాడుతూ, "మార్కెట్లో లీడర్ పొజిషన్‌లో సంస్థ భవిష్యత్తులో పర్యావరణం మీద దృష్టి ఉంచుకుని మరిన్ని హైబ్రిడ్ కార్లను అభివృద్ది చేస్తున్నట్లు" ప్రకటించారు.


Click it and Unblock the Notifications








