కార్లు మాత్రమే కాదు ఇక నుండి చిన్న చిన్న ట్రక్కులు కూడా: మారుతి

By Anil

ఇండియన్ మార్కెట్లో ప్రతి సెగ్మెంట్లో కూడా ఎంతో సరసమైన ఉత్పత్తులను అందించిన ఘనత మారుతి సుజుకికు ఉంది. కేవలం ప్యాసింజర్ వాహనాలనే కాకుండా చిన్న పాటి ట్రక్కులను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు మారుతి చైర్మెన్ ఆర్ సి భార్గవన్ ప్రకటించారు.

కార్లు మాత్రమే కాదు ఇక నుండి చిన్న చిన్న ట్రక్కులు కూడా: మారుతి

ఈ ఏడాదిలోపు మారుతి తమ మొదటి ఎల్‍‌సివి (లైట్ కమర్షియల్ వాహనం) వాహనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. గత కొంత కాలంగా మారుతి దీనిని అభివృద్ది చేస్తోంది. ఇంతకు మునుపే దీనిని పూర్తి స్థాయిలో అభివృద్ది చేసినప్పటికీ, భారతీయ రోడ్ల మీద ఇది మోయగలిగే బరువు మరియు ఇతర సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని రీడిజైన్ చేసినట్లు తెలిసింది. ఈ కారణం చేతనే ఎప్పుడో విడుదల కావాల్సిన ఇది ఈ ఏడాదికి సిద్దమైంది.
Also Read: ఎస్‌యువిలకు ఫిదా అయిపోయిన ఇండియన్స్
ఇండియన్ మార్కెట్‌ను ఉద్దేశించి డిజైన్ కాబడుతున్న మారుతి వారి సూపర్ క్యారీ ఎల్‌సివి వాహనంలో 800సీసీ సామర్థ్యం డీజల్ ఇంజన్‌ను అందివ్వనున్నారు. దీనిని మారుతి సుజుకి సెలెరియోలోని డీజల్‌లో గుర్తించవచ్చు. అంతే కాకుండా ఇందులో సిఎన్‌జి మోడల్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
Also Read: విజయం అంటే ఇది : బజాజ్ వి మోటార్ సైకిల్స్
మారుతి ఇతర దేశాలకు ఎగుమతి చేయనున్న వేరియంట్లలో 1.2-లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను అందివ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. మారుతి దీనిని దేశీయంగా అందుబాటులోకి తీసుకువస్తే ఇండియన్ మార్కెట్లో ఉన్న టాటా ఏస్ మరియు మహీంద్రా మ్యాక్సిమో ప్లస్ వంటి వాటికి పోటీగా నిలవనుంది. దీని సామర్థ్యం గరిష్టంగా 1 టన్ను వరకు ఉండనుంది.
Article Published On: Tuesday, July 26, 2016, 14:31 [IST]
English summary
Maruti Super Carry LCV Launch Confirmed For This Year - Maruti Chairman
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+