2016 ఆటో ఎక్స్ పోలో మన ముందుకు రానున్న ఆల్టో 800 ఫేస్ లిఫ్ట్
మారుతి సుజుకి వారి ఆల్టో 800 కారు దేశ వ్యాప్తంగా అత్యధిక అమ్మకాలు సాధిస్తున్న కార్లలో మొదటి స్థానంలో నిలిచింది. ఇటువంటి సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న ఈ కారును విభిన్న ఆప్షన్‌లలో మార్కెట్లోకి అందించాలని మారుతి సుజుకి యోచిస్తోంది. అందులో భాగంగానే ఆల్టో 800 కారును ఫేస్ లిఫ్ట్ మోడల్‌తో అందుబాటులోకి తీసుకురానుంది.
మారుతి సుజుకి ఈ ఆల్టో 800 ఫేస్ లిఫ్ట్ కారును 2016 ఢిల్లీలో జరగబోయే ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించనుంది. దీనికి సంభందించిన మరిన్ని వివరాలు క్రింది కథనంలో....

డిజైన్
మారుతి సుజుకి సంస్థ ఈ ఆల్టో 800 ను ఫేస్ లిఫ్ట్ ఆప్షన్‌లో అందించడంతో పాటుగా ముందు వైపు డిజైన్‌లో స్వల్ప మార్పులతో విడుదల చేయనున్నారు. అంతే కాకుండా ఇంటీరియర్‌కు కూడా కొంత వరకు మార్పులు చేయనున్నట్లు సమాచారం.

డీజల్ ఇంజన్
మారుతి సుజుకి తమ అన్ని ఎంట్రీలెవల్ కార్లలో పెట్రోల్ ఇంజన్ ను మాత్రమే అందుబాటులో ఉంచింది. అయితే 2016 ఆల్టో 800 ఫేస్ లిప్ట్ కారులో డీజల్ ఇంజన్‌ను కూడా అందివ్వనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్
2016 లో ఢిల్లీ ఎక్స్ పో ద్వారా మనకు పరిచయం కానున్న మారుతి సుజుకి ఆల్టో 800 కారులో ఆప్షనల్‌గా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్ బాక్స్‌ను అందివ్వనున్నారు.

ధర
మారుతి సుజుకి ఆల్టో 800 ఫేస్ కారులోని ప్రకారంభ వేరియంట్ ధర రూ. 3 లక్షల వరకు ఉండనుంది.

2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో
2016 లో జరిగే ఇండియన్ ఆటో ఎక్స్ పో అతి త్వరలో ప్రారంభం కానుంది. అక్కడ ప్రదర్శించబడే అన్ని రకాల కొత్త వాహనాల గురించి తెలుసుకోవడానికి డ్రైవ్‌స్పార్క్‌తో కలసి ఉండండి.

- ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్తుత్తమ విమానాలు
- యస్-క్రాస్ మీద 3 లక్షల వరకు ఆఫర్ ప్రకటించిన మారుతి సుజుకి
- ల్యాంబోర్గినిగా మారిన మారుతి కారు....!


Click it and Unblock the Notifications








