ఎమ్ఎస్ ధోని స్పెషల్ ఎడిషన్ మారుతి ఆల్టో పరిచయం
మారుతి సుజుకి భారత జట్టు కెప్టెన్ ఎమ్ఎస్ ధోని ప్రేరిత స్పెషల్ ఎడిషన్ మారుతి ఆల్టోను గడిచిన శనివారం (24/09/2016) పరిచయం చేసింది. ఎమ్ఎస్ ధోని యొక్క జీవితం ఆధారంతో తెరకెక్కిన ఎమ్ఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరీ చిత్రంతో మారుతి అసోయేట్‌గా ఉంది.

మారుతి సుజుకి విడుదల చేసిన స్పెషల్ ఎడిషన్ ఆల్టో అక్టోబర్ రెండవ వారం నుండి అమ్మకాలకు సిద్దంగా అందుబాటులోకి రానుంది.

ఇండియన్ మార్కెట్లో అత్యంధిక అమ్మకాలు సాధించిన ఆల్టో ఎమ్ఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరీ సినిమాతో అధికారికంగా అసోసియేట్ అయినట్లు మారుతి సుజుకి ఎక్జ్సిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ మరియు సేల్స్) ఆర్ఎస్ ఖల్సీ ఓ ప్రకటనలో తో తెలిపాడు

మారుతి ఎమ్ఎస్ ధోని ప్రేరిత స్పెషల్ ఎడిషన్ ఆల్టో లో స్పోర్టివ్ సీట్ కవర్లు, బాడీ డీకాల్స్ గ్రాఫిక్స్ మీద ఎమ్ఎస్ ధోని సిగ్నేచర్, హై ఎండ్ మ్యూజిక్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు,వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

మారుతి తమ ఆల్టో 800 మరియు ఆల్టో కె10 రెండింటిని స్పెషల్ ఎడిషన్ లతో విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో ధోనితో పాటు తన చిత్రం ఎమ్ఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరీ నటులతో పాల్గొన్నారు.

మారుతి ఈ స్పెషల్ ఎడిషన్ ఆల్టో 800 కు ఎక్ట్సీరియర్ మార్పులు మార్పులు మాత్రమే కల్పించింది. సాంకేతికంగా ఏ విధమైన మార్పులు చోటు చేసుకోలేదు.

మారుతి తమ ఆల్టో 800 స్పెషల్ ఎడిషన్ లో అదే శక్తివంతమైన మూడు సిలిండర్ల 796సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్‌ను అందించింది.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 6000ఆర్‌పిఎమ్ వద్ద 48బిహెచ్‌పి పవర్ మరియు 3,500ఆర్‌పిఎమ్ వద్ద 69ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఐదు మంది కూర్చుని ప్రయాణించడానికి వీలున్న ఈ ఆల్టో 800 కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసందానం చేశారు.

ఆల్టో 800 లోని ప్రారంభ వేరియంట్ ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 3,04,712 లు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 4,53,505 లు.

ఆల్టో కె10
మారుతి స్పెషల్ ఎడిషన్ ఆల్టో కె10 కూడా పరిచయం చేసింది. ఇందులో అదే 998సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్‌ను అందించింది.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 6,000ఆర్‌పిఎమ్ వద్ద67బిహెచ్‌పి పవర్ మరియు 3,500ఆర్‌పిఎమ్ వద్ద 90ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఇందులోని ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లను అనుసంధానం చేసారు.

ఇందులోని ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లను అనుసంధానం చేసారు.

- పాకిస్తాన్‌తో భారత్‌కు పొంచి ఉన్న ముప్పు....!!
- లగ్జరీ నౌకల్లో మానవాళికి తెలియని భయంకర రహస్యాలు
- హ్యాట్సాఫ్ టు ఇండియన్ ఆర్మీ: చైనాకు ముప్పు తిప్పలు పెడుతున్న భారతీయ సైన్యం


Click it and Unblock the Notifications








