ఒక లక్ష మైలురాయిని దాటిన మారుతి బాలెనొ
భారత దేశపు అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ దేశీయంగా మరో రికార్డు నెలకొల్పింది. మారుతి దేశీయంగా సుమారుగా లక్ష యూనిట్ల బాలెనొ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలు సాధించింది.

మారుతి సుజుకి తమ బాలెనొ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ను అక్టోబర్ 2015 లో మార్కెట్లోకి విడుదల చేసారు. అనతి కాలంలోనే సంస్థ యొక్క బెస్ట్ సెల్లింగ్ కార్ల విభాగంలోకి చేరిపోయింది.

దేశీయ అమ్మకాలు మినహాయిస్తే ఇప్పటి వరకు సుమారుగా 33,800 బాలెనొలు విదేశీ మార్కెట్లకు ఎగుమతి అయ్యాయి. అందులో జపాన్ మరియు యూరప్ మార్కెట్లకు ఎక్కువగా ఎగుమతి అయ్యాయి.

లక్ష మైలు రాయిని దాటడం ద్వారా కొత్త వినియోగదారులు బాలెనొను బుక్ చేసుకునే అవకాశాలు పెరిగాయి. దీనికి ఈ ఏడాది పండుగ సీజన్ కూడా మరింత బలం చేకూర్చనుంది.

మేకిన్ ఇండియా చొరవతో జపాన్‌కు చెందిన సుజుకి దేశీయంగా ఉత్పత్తి చేసిన బాలెనొ అంతర్జాతీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతోంది.

మారుతి సుజుకి దేశీయంగా ఉత్పత్తి చేసి జపాన్‌కు ఎగుమతి చేస్తున్న మొదటి ఉత్పత్తి ఈ బాలెనొ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్.

మారుతి ఈ బాలెనొ ను జపాన్‌తో పాటు, యూరప్, ఆస్ట్రేలియా, లాటిన్ అమెరికా, న్యూజిలాండ్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తోంది. మారుతి ఈ బాలెనొను 100 అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయాలనే లక్ష్యంతో ఉంది.

బాలెనొ సాధించిన విజయానికి మారుతి సుజుకి మార్కెటింగ్ మరియు సేల్స్ విభాగాలకు ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న ఆర్ఎస్ ఖల్సి మాట్లాడుతూ, భారతీయ వాహన పరిశ్రమ చరిత్రలో బాలెనొ పెద్ద విజయం అని పేర్కొన్నారు.

బాలెనొ డిజైన్ మారుతి యొక్క అధునాతన డిజైన్ భాషను మరియు భవిష్యత్ డిజైన్ సూచిస్తోందని మరియు ఇందులో మొదటి సారిగా హై-ఎడ్ ఫీచర్లయిన ఆపిల్ కార్ ప్లే వంటి వాటిని అందించినట్లు తెలిపాడు.

మారుతిలోని ఇంజనీర్లు నూతన ఉత్పత్తులు ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా సరికొత్త వేదికను రూపొందించుకున్నారని, అందులో అభివృద్ది చెందినదే ఈ బాలెనొ. ఇది సుపీరియర్ రైడింగ్ మరియు హ్యాండ్లింగ్‌లో అద్భుతమని తెలిపారు.

ఈ శ్రేణిలో ఉత్తమ మైలేజ్ ఇవ్వగల ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కూడా ఇదే.

భద్రత పరంగా ఇందులో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లను స్టాండర్డ్‌గా అందించారు. బాలెనొను అన్ని విధాలుగా విశ్లేషించిన అనంతరం ఇది నిజంగానే మేకిన్ ఇండియా చొరవతోనే తయారు చేయబడింది ముక్త కంఠంతో చెప్పవచ్చు.

- పాక్ ఉగ్ర స్థావరంపై ధృవ్ హెలికాప్టర్ సర్జికల్ దాడి
- బ్రియో ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర, ఫీచర్లు, విడుదల వివరాల కోసం
- ఇండియన్ ఆటోమొబైల్ చరిత్రలో బిగ్ డీల్


Click it and Unblock the Notifications








