అంతర్జాతీయ ఆధిపత్యం దిశగా మారుతి బాలెనొ
మారుతి సుజుకి గత ఏడాది ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన బాలెనొ ప్రీమియమ్ ఎంతో విజయవంతమయ్యింది. దేశీయంగా బాలెనొ విజయం సాధించిన నేపథ్యంలో మారుతి దీనిని బ్రిటన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. జూన్ 1, 2016 న బ్రిటన్ ఆటోమొబైల్ మార్కెట్లోకి మారుతి మొదటి సారిగా తమ బాలెనో కారుతో ఆరంగ్రేటం చేయనుంది. దీని గురించి పూర్తి వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

మారుతి సుజుకి దేశీయంగా తయారు చేసిన బాలెనొ కార్లను బ్రిటన్ మార్కెట్లోకి అందించనుంది. అంటే మేకిన్ ఇండియా కార్లన్నమాట.

మారుతి బాలెనొలో రెండు వేరియంట్లను మాత్రమే అక్కడి మార్కెట్‌కు ఎగుమతి చేస్తోంది. అవి ఎస్‌జడ్‌టి మరియు ఎస్‌జడ్5 బ్రిటన్ వినియోగదారులకు ఇందులో బూస్టర్ జెట్ ఇంజన్‌లను అందిస్తోంది.

ఇందులోని టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ సుమారుగా 109 బిహెచ్‌పి పవర్ మరియు 170 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది.

ఈ ఇంజన్ గల బాలెనొ వేరియంట్లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మారుతి సుజుకి బాలెనొలో 1.2-లీటర్ డ్యూల్ జెట్ పెట్రోల్ ఇంజన్‌ను అందిస్తున్నారు. ఇందులో ఎస్‌హెచ్‌విఎస్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు.

మారుతి బాలెనొలో అందిస్తున్న స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ బై మారుతి అనే మైక్రో హైబ్రిడ్ సాంకేతికతలో లిథియమ్ బ్యాటరీలను వినియోగిస్తారు.

బ్యాటరీలు మరియు పెట్రోల్ ఇంజన్ సంయుక్తంగా కలిసి వినియోగించుకోవడం ద్వారా ఇది సుమారుగా 24.99 కిలోమీటర్లు మైలేజ్‌ను ఇవ్వగలుగుతుంది.

ఎక్కువ మైలేజ్ రావడానికి సహాయపడే ఈ ఎస్‌హెచ్‌విఎస్ టెక్నాలజీని మారుతి సుజుకి ప్రస్తుతం తమ సియాజ్ మరియు ఎర్టిగా కార్లలో మాత్రమే అందించింది.

ఫీచర్ల పరంగా చూస్తే బ్రిటన్‌లో అడుగిడుతున్న బాలెనొలో
- హై ఇంటెన్సిటీ డిస్జార్జబుల్ (HID) హెడ్ ల్యాంప్స్,
- 16-అంగుళాల అల్లాయ్ వీల్స్,
- వెనుక వైపున ప్రైవసీ గ్లాస్,
- శాటిలైట్ న్యావిగేషన్ సిస్టమ్,
- వెనుక వైపున ఎల్‌ఇడి లైట్లు,
- అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్,
- 4.2-అంగుళాల పరిమాణం ఉన్న సెంటర్ కూల్ డిస్ల్పే,
- రాడార్ బ్రేక్ సపోర్ట్ వంటి ఫీచర్లు కలవు.


మారుతి సుజుకి ఈ బాలెనొ కారును 12,999 నుండి 15,349 పౌండ్ల మధ్యన ధరను నిర్ణయించనున్నారు. మన రుపాయల్లో దీని విలువ 12.8 నుండి 15.11 లక్షలుగా ఉంటుంది.

బ్రిటన్‌లో మారుతి సుజుకి వారి బాలెనొ కారు వోక్స్‌వ్యాగన్ పోలో మరియు ఫోర్డ్ ఫియస్టా వంటి కార్లకు పోటీగా నిలవనుంది.

బ్రిటీష్ దెబ్బకు నేల చూపులకు పరిమితం అయిన వ్లాదిమిర్ పుతిన్


Click it and Unblock the Notifications