ఎంట్రీ లెవల్ కార్ల మీద ఆఫర్లు మరియు డిస్కౌంట్లతో హ్యుందాయ్‌ని చితక్కొడుతున్న మారుతి
హ్యుందాయ్ మోటార్స్ తమ లైనప్‌లోని దాదాపు అన్ని ఉత్పత్తుల మీద ఆఫర్లు మరియు డిస్కౌంట్లు ప్రకటించిన తరువాత మారుతి సుజుకి తమ ఎంట్రీ లెవల్ ఉత్పత్తుల మీద అద్బుతమైన ఆఫర్లు మరియు డిస్కౌంట్లను వెల్లడించింది.
భారత దేశపు అతి పెద్ద కార్ల తయారీ మరియు అమ్మకందారు మారుతి సుజుకి తమ ఎంట్రీ లెవల్ కార్లను కొనుగోలు చేసే కస్టమర్లకు లబ్ధిచేకూర్చే విధంగా కేవలం ఎంట్రీ లెవల్ కార్ల మీద మాత్రమే ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించింది.

తక్కువ బడ్జెట్లో అందుబాటులో ఉన్న ఎంట్రీ లెవల్ కార్ల మీద ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించిన అనంతరం, వీటి బుకింగ్ చేసుకునేందుకు నగదు రహిత చెల్లింపుల కోసం ఉన్న క్రెడిట్, డెబిట్ కార్డ్, ఆర్‌టిజిఎస్, ఆన్ లైన్ బ్యాంకింగ్ మరియు ఇ-వ్యాలెట్లను అంగీకరిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం గత నెల ఎనిమిదవ తేదీన పెద్ద రూ. 1000 మరియు రూ. 500 నోట్ల రద్దు చేసింది. ఈ కారణంగా అత్యుత్తమ విక్రయాలు సాధించే ఆల్టో తిరోగమనం పాటించింది. అమ్మకాలను పెంచుకునేందుకు ఆల్టో ని కేవలం 2.5 లక్షల ప్రారంభ (ఎక్స్ షోరూమ్) ధరకే అందుబాటులో ఉంచింది.

మారుతి తమ ఆల్టో మీద మొత్తం రూ. 60,000 ల వరకు లాభాలున్నాయి. అందులో రూ, 30,000 వరకు ధర తగ్గింపు మరియు రూ. 25,000 ల ఎక్స్‌చ్చేంజ్ బోనస్‌లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 5,000 రుపాయల వరకు అదనపు తగ్గింపును ప్రకటించింది.

మారుతి సుజుకి తమ ఆల్టో కె10 మీద రూ, 25,000 ల ధర తగ్గింపు మరియు ఎక్స్‌చ్చేంజ్ బోనస్ క్రింద 25,000 రుపాయల తగ్గింపుతో పాటు ప్రభుత్వ ఉద్యోగలకు రూ. 5,000 ల తగ్గింపు కలదు. ఇవి కాకుండా ఆటోమేటిక్ వేరియంట్ మీద అదనంగా రూ. 5,000 ల తగ్గింపు ప్రకటించింది.

మారుతి సుజుకి సెలెరియో మీద ఎక్స్‌చ్ఛేంజి ఆఫర్ రూ, 25,000 లు, ధర తగ్గింపు రూ. 20,000 లు మరియు ఆటోమేటిక్ వేరియంట్ మీద అదనంగా రూ. 5,000 ల తగ్గింపు కలదు.

మారుతి సుజుకి తమ టాల్ బాయ్ హ్యాచ్‌బ్యాక్ మీద మొత్తం రూ. 30,000 ల వరకు లాభాలను ప్రకటించింది. అందులో ఎక్స్‌చ్ఛేంజ్ ఆఫర్ రూ. 25,000 లు మరియు ఆటోమేటిక్ వేరియంట్ ఎంచుకునే వారికి అదనంగా రూ, 5,000 ల వరకు తగ్గింపు కలదు.

- ఆఫర్లు: 2,50,000 లక్షల రుపాయల వరకు తగ్గింపు ప్రకటించిన హ్యుందాయ్ మోటార్స్
- ఆరు లక్షలకే బెంజ్ కారా ఇదెలా సాధ్యం
- కొత్త తరం హయాబుసాతో విడుదలకు సిద్దమైన సుజుకి


Click it and Unblock the Notifications








