భారీగా తగ్గిన మారుతి సుజుకి సియాజ్ ధరలు
మారుతి సుజుకి సంస్థ తమ సియాజాలోని ఎస్‌హెచ్‌విఎస్ పరిజ్ఞానం గల కార్ల మీద భారీ స్థాయిలో ధరలు తగ్గించారు. ఇలా ధరలు తగ్గించడానికి కారణం, హైబ్రిడ్ మరియు ఎలక్ట్రివ్ వాహనాల మీద ఉన్న ఎక్సైజ్ సుంకం 24 నుండి 12.5 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా మారుతి హైబ్రిడ్ టెక్నాలజీ గల సియాజ్ కార్ల ధరలు తగ్గించింది. ధరలు తగ్గిన తరువాత ప్రస్తుతం సియాజ్ ధరలు మరయు సియాజ్ గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో....

ఎక్సైజ్ సుంకం తగ్గడం వలన మారుతి సియాజ్ హైబ్రిడ్ కార్ల ధరలు
- సియాజ్ విడిఐ ధర రూ. 7.68 లక్షలు
- సియాజ్ విడిఐ (ఒ) ధర రూ. 7.82 లక్షలు
- సియాజ్ విడిఐ ప్లస్ ధర రూ. 8.23 లక్షలు
- సియాజ్ జడ్‌డిఐ ధర రూ. 8.89 లక్షలు
- సియాజ్ జడ్‌డిఐ ప్లస్ ధర రూ. 9.50 లక్షలు అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.
- సియాజ్ పెట్రోల్ మైలేజ్ - 20.73 కిలోమీటర్/లీటర్
- సియాజ్ డీజల్ మైలేజ్ - 28.09 కిలోమీటర్/లీటర్
- పియర్ల్ స్నో వైట్
- పియర్ల్ మెటాలాకి డెజినిటి బ్రౌన్
- పియర్స్ సాంగ్రియా రెడ్
- మెటాలిక్ సిల్కీ సిల్వర్
- మెటాలిక్ గ్లిస్టెనినా గ్రే
- పియర్ల్ మిడ్ నైట్ బ్లాక్
- మెటాలిక్ క్లియర్ బీజీ

ఇంజన్ వివరాలు
మారుతి సుజుకి సియాజ్‌లో 1373 సీసీ కెపాసిటి గల పెట్రోల్ మరియు 1248 సీసీ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌లు కలవు. ఈ రెండింటికి కూడా హైబ్రిడ్ సాంకేతికతను అనుసంధానం చేశారు.

పవర్ మరియు టార్క్ వివరాలు
ఇందులోని పెట్రోల్ ఇంజన్ 6,000 ఆర్‌ప్ఎమ్ వద్ద 91 బిహెచ్‌పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వేగం వద్ద 130 ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా ఇందులోని డీజల్ ఇంజన్ 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 89 బిహెచ్‌పి పవర్ మరియు 1750 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మైలేజ్
మారుతి సుజుకి వారు తమ సియాజ్ కార్లలో హైబ్రిడ్ టెక్నాలజీని వినియోగించడం వలన సియాజ్ కార్లు మంచి మైలేజ్‌ను ఇవ్వగలుగుతున్నాయి.

ట్రాన్స్‌మిషన్ వివరాలు
ఇంజన్ విడుదల చేయు మొత్తం పవర్ ముందు చక్రాలకు అందుతుంది ( ఫ్రంట్ వీల్ డ్రైవ్). సియాజ్ ఎట్రీ లెవల్ మరియు మిడ్ రేంజ్ వేరియంట్లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు. అయితే సియాజ్ పెట్రోల్‌లోని టాప్ ఎండ్ వేరియంట్లు 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో కలవు.

ఎక్సైజ్ సుంకం కారణంగా మారుతి సుజుకి వారి సియాజ్ హైబ్రిడ్ కార్ల ప్రస్తుతం ధరలను మునుపటి ధరలతో పోల్చితే అన్ని వేరియంట్ల మీద సుమారుగా రూ. 69,000 ల వరకు తగ్గాయి.

మారుతి సుజుకి తమ సియాజ్‌లోని పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్లలో కూడా ఈ స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ బై సుజుకి అనే పరిజ్ఞానం అందించింది. దీని ద్వారా తక్కువ ఇంధనం వినియోగం జరిగి ఎక్కువ స్థాయిలో మైలేజ్ వస్తుంది.

ప్రస్తుతం మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లో మంచి అమ్మకాలు చవిచూస్తున్న బాలెనో మరియు వితారా బ్రిజా వాహనాలలో కూడా ఈ ఎస్‌హెచ్‌విఎస్ హైబ్రిడ్ టెక్నాలజీని అందివ్వాలనే ఆలోచనలో ఉంది.

మారుతి సుజుకి సియాజ్ లభించు రంగులు

ప్రతి చుక్క లెక్కలోకే....ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 కార్లు
నిన్న కాక మొన్న వచ్చింది, మారుతి సుజుకి డిజైర్‌ను పడగొట్టింది


Click it and Unblock the Notifications